ఎల్లో ఫంగస్ అంటే ఏమిటి ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కరోనా వైరస్ ఏ ముహూర్తాన భూమిపై జీవం పోసుకుందో కానీ అప్పటి నుండి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. మహమ్మారి బారి నుండి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే క‌రోనా మ‌హమ్మారితో పోరాటం చేసి గెలిచిన‌వారిని.. ఇప్పుడు ఫంగ‌స్ లు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు కరోనావైరస్ ప్రజలను బెంబేలెత్తించగా.. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ వణికించింది. దీని తర్వాత వైట్ ఫంగస్ గురించి విన్నాం. తాజాగా ఎల్లో ఫంగస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఎల్లో ఫంగస్‌ను వైద్యులు గుర్తించారు. ఎల్లో ఫంగస్‌ సహజంగా భూమి మీద పాకే జంతువుల్లో ఉంటుందని, మనుషుల్లో తొలిసారిగా దీనిని గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై వైద్యులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

ఎల్లో ఫంగస్ఈ రకం ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ కంటే మరింత ప్రమాదకారని భావిస్తున్నారు. బద్దకం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా ఆకలి లేకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఎల్లో ఫంగస్ వల్ల శరీరంలో చీము కారడం వంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫంగస్ వల్ల శరీరానికి ఏర్పడిన గాయాలు నెమ్మదిగా తగ్గుతాయని, కంటిచూపు కోల్పోవడం, అవయవాలు పనిచేయకపోవడం, క్రమంగా శరీర కణాలు నశిస్తాయి. ఎల్లో ఫంగస్ ప్రాణాంతకమని ఎందుకంటే అంతర్గతంగా అవయవాలను దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరించారు.

ఎల్లో ఫంగస్ఎల్లో ఫంగస్ లక్షణాలు:

1. శారీరక అలసట ఉంటుంది.

2. బరువు తగ్గడం, నీర‌సం, స్థిరమైన అలసట ఉంటుంది.

3.అవయవాలు పనిచేయకపోవడం, క్రమంగా శరీర కణాలు నశిస్తాయి.

4. ఆకలి త‌క్కువ‌గా ఉంటుంది లేదా అస్స‌లు ఆక‌లి కాదు

5. వైర‌స్ ప్రభావం ఎక్కువగా ఉంటే శ‌రీరంలోని వివిధ భాగాల నుంచి చీము బయటకు వస్తుంది.

6. ఎటువంటి గాయమైనా త్వరగా నయం కాదు.

ఎల్లో ఫంగస్ లక్షణాలు బయటపడితే తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి యాంటీ-ఫంగల్ డ్రగ్ ఆంఫోటెరిసిన్‌-బిను వినియోగించాలని తెలిపారు. ఎల్లో ఫంగ‌స్ క‌ళ్లపై విపరీత‌మైన ప్ర‌భావం చూపుతుంది. తీవ్ర‌త అధికంగా ఉంటే చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎల్లో ఫంగస్ అటాక్ అయితే, వివిధ అవయవాలు ప‌నిచేయ‌డం ఆగిపోయి.. విక‌లాంగులు అవ్వొచ్చు. ఈ ఫంగస్ శరీరంలోని ఏ భాగానైనా డ్యామేజ్ చేయొచ్చు. ముఖ్యంగా అంతర్గత భాగాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఎల్లో ఫంగస్ఈ ఎల్లో ఫంగస్ సంక్రమణకు కారణం అపరిశుభ్రతేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ ఫంగస్ శరీరంలో గూడు కట్టుకుంటుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం, మలం నుంచి కూడా వ్యాప్తికి సహాయపడుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ విస్తరణను ప్రోత్సహిస్తున్నందున ఎక్కువ తేమ కూడా సంక్రమణకు దారితీస్తుంది. తేమ 30% నుంచి 40% మధ్య ఉంటే ముప్పు ఉంటుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఎల్లో ఫంగస్ మరణాల రేటు చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది శరీరం లోపలి భాగంలో ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది.

ఎల్లో ఫంగస్అందువల్ల, వ్యక్తిగత శుభ్రత మెయిన్‌టెయిన్ చేయాలని సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే బ్యాక్టీరియా ఫంగస్‌ పేరుకుపోయి దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంటిలో తేమ శాతం కూడా చూసుకుంటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని చెప్పారు. ఈ జాగ్రత్తలు పాటించడంతో పాటు పైన చెప్పిన వాటిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR