ఎటువంటి ఆకారం కలిగిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తే మంచిది ?

“ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు” ఇది ఒక సామెత. ఇల్లు కట్టడం అంటే చిన్న విషయం కాదు మనం మన పిల్లలు, మనుమలు కొన్ని తరాలు సంతోషంగా గడపాలని ఇల్లు నిర్మాణం చేస్తారు. మరి అటువంటి ఇంట్లో ఎక్కువ కాలం ఉండాలంటే అన్నివిధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు చూద్దాం.

ఇంటి నిర్మాణంపొడవు ఎక్కువగా ఉండి, భుజాల్లో హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశు హాని, అనారోగ్యం కలిగిస్తుంది. స్థలానికి సంబంధించిన నాలుగు భుజాల్లో హెచ్చు తగ్గులున్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే అశుభాలు కలుగు తాయని వాస్తు చెబుతోంది.

చేట ఆకారంలో గల స్థలం కూడా ఇంటి నిర్మాణానికి మంచిది కాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తుంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం కూడా జరుగుతుందని వాస్తు శాస్తజ్ఞ్రులు అంటున్నారు.

ఇంటి నిర్మాణం

  • ఢమరుకపు ఆకారంలో ఉండే స్థలం కూడా మంచిది కాదు. ఇలాంటి నేలలో ఇంటి నిర్మా ణం చేపడితే సంతానం కలగటంలో సమస్యలు, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
  • లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తుంది.
  • కుంభాకార స్థలంలో కట్టే ఇంటి వల్ల భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది.
  • విసన కర్ర ఆకార స్థలం ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
  • మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను సృష్టిస్తాయి. విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
  • అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇంటి నిర్మాణం’L’ ఆకారంలో ఉండే స్థలంలో ఇంటి నిర్మాణం అశుభం. చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఇంటిని, అపార్ట్‌మెంట్‌ లను నిర్మించాలని వాస్తుశాస్త్రాలు చెబుతున్నాయి. అలా నిర్మించని గృహాలపై విషవాయువుల ప్రభావం ఉంటుందని పలువురు శాస్తజ్ఞ్రుల విశ్వాసం కూడా.

ఇంటి నిర్మాణంఇల్లు, ఆపార్ట్‌ మెంట్‌, ఆఫీస్‌ ఇలా ఏదైనా ఒకవిధమైన షేప్‌పై ఆధారపడి నిర్మించటం జరుగుతుంది. అలాకాకుండా నిర్మాణానికి పరిమితం లేని పక్షంలో సీత గీత దాటినట్టు, హద్దుదాటి ప్రత్యేకంగా ఏ గదైనా దాటి నిర్మించటం మంచిది కాదు.అందు చేత గృహాలు నిర్మించేటపుడు జాగ్రత్తతో, వాస్తు ప్రకారం షేప్‌ను పాటించి నిర్మించాలి.

ఇంటి నిర్మాణంఅయితే ‘ఎల్‌’ షేప్‌ ను వాస్తుశాస్త్రంలో అసంపూర్ణ చిహ్నంగా శాస్తజ్ఞ్రులు స్పష్టం చేస్తున్నారు. ‘ఎల్‌’ ఆకారంలో ఇంటి నిర్మాణం చేపడితే గృహాలకు సహాయాన్ని అందించే ప్రకృతి సిద్ధమైన శక్తులను దూరం చేసుకునే పరిస్థితి కలుగుతుందని వాస్తు పండితుల అభిప్రాయం. ఇప్పటికే తమ ఇళ్లలో ‘ఎల్‌’ ఆకారముంటే ఆ ఆకారాన్ని మార్చే విధంగా దీర్ఘ చతుర్రసం వచ్చేలా స్థలానికి ఒకమూల మొక్కను నాటడం గాని, లేదా ఏదైనా పోల్‌ను పాతటం కానీ మంచిది. ఇలా చేస్తే కొంతైనా దుష్ప్రయోజనాలకు దూరంగా ఉంచటానికి సాధ్యపడు తుంది. కాబట్టి ఇంటి నిర్మాణం చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారాన్ని మాత్రమే కలిగిఉండాలి. అలా లేని పక్షంలో విద్యా విషయంలో సమస్యలు ఏర్పడటం, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, భార్యాభర్తల మధ్య స్పర్థలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR