Home Health కూరగాయాలు,పండ్లును వినియోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కూరగాయాలు,పండ్లును వినియోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

0

వేగంగా పంట చేతికి రావాలనే ఉద్దేశంతో రైతులు విషపూరిత రసాయనాలను విస్తృతంగా చల్లుతున్నారు. ఈ కారణంగా పండ్లు, కూరగాయల ఉపరితలాలపై క్రిమిసంహారక మందుల అవశేషాలను అలాగే ఉండిపోతున్నాయి. వాటని పండ్లు, కూరగాయలు ప్రతిరోజూ మనం తీసుకునే పోషకాహారంలో అవి కీలకపాత్ర వహిస్తాయి. క్రిమి సంహారక అవశేషాలు కలిగిన పండ్లు, కూరగాయలను యధాతథంగా మనం ఆహారంగా తీసుకుంటున్నాం.

Vegetablesఅయితే కూరగాయాలు,పండ్లును వినియోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ విషయంలో నిపుణులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యం విషయంలో ఆహారం, పరిశుభ్రత చాలా ముఖ్యమైన అంశాలు. కావున జనాలు వాటికి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. మన జీవనశైలిలో పాటించే పద్దతులే మనల్ని ఆరోగ్యం ఉండడానికి తోడ్పడతాయి.

సురక్షిత ఆహార ఆహారం వినియోగించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేసింది. మార్కెట్ నుంచి తెచ్చిన వాటిని నేరుగా ఉపయోగించకుండా.. తప్పనిసరిగా నల్లా నుంచి నీటి ధారతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో బేకింగ్‌ సోడా లేదా ఉప్పు వేసి కూరగాయలు అందులో కొద్దిసేపు ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ వాటిని కడిగితే రసాయన అవశేషాలు చాలా వరకూ తొలగిపోతాయి.

 

Exit mobile version