కాళ్ళు కడిగి కన్యాధానం చేసే సమయంలో మామగారు ఏం అనుకోవాలో తెలుసా?

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. ఇల్లంతా పచ్చటి తోరణాలు, బంధువుల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల రెపరెపలు, చిన్నారుల అల్లరితో పెళ్లి ఇంట సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతి ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని ఒక ఘట్టం గురించి తెలుసుకుందాం…

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిలో మామగారు అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొనే ఆచారం ఒకటి ఉంది.

kanyadanప్రతి ఆచారం వెనక ఎదో ఒక పరమార్ధం ఉంది. పెళ్లి పనులు మొదలు పెట్టటానికి ముందు ఎటువంటి విఘ్నలు రాకుండా వినాయకునికి బియ్యం మూట కట్టి ఆ తర్వాత పనులను మొదలు పెడతారు.

marriageఅలాగే పెళ్ళిలో ఆడపడుచుకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి దూరం కాలేదన్న భావన కలిగించటానికి ఈ ఆచారాలు పెట్టారు.

akshintaluఇక పెళ్ళిలో అల్లుడి కాళ్ళు కడిగే సమయంలో మామగారు ఏమని అనుకుంటారో తెలుసుకుందాం. ఓ పెండ్లి కుమారుడా పంచ భూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన నా కూతురుని ధర్మ,అర్ధ,కామ,మోక్షలకై నీకు అర్పిస్తున్నాను.
దానం ఇస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను.

rice bag tyingఓ పెండ్లి కుమారుడా నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివే. నా బిడ్డ లక్ష్మి దేవి.
అంతటా నీకు కాళ్ళు కడుగుతున్నానని చెప్పి వరుడి కాళ్ళు కడుగుతాడు వధువు తండ్రి. వారిని లక్ష్మి నారాయణులుగా భావించి పెళ్ళికి వచ్చిన వారందరు వారి మీద అక్షింతలు వేసి నమస్కారం చేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR