స్మశాన వాటికలో ఇంటిళ్ల పాది దీపావళి జరుపుకునే వింత ఆచారం ఎక్కడ ?

భారత దేశం భిన్న మతాలు , భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాల సమ్మేళనం. అందుకే ఇక్కడ రక రకాల వేషభాషలు ఉంటాయి.ఒక్కో ప్రాంతం వారు ఒక్కో భాష కట్టూ బొట్టు ఆచారాలు ఉంటాయి. పట్టణాల్లో..పల్లెల్లో కొన్ని ఆచారాలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక ఆటవిక ఆచారాలు మరీ భిన్నంగా ఉంటాయి. అయితే కొన్ని ఆ ప్రాంత ప్రజలకు అది సర్వ సాధారణం కావచ్చు.

Deepavaliసాధార‌ణంగా దీపావళి పండుగ అంటే ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు. ఇక‌ పిల్లలకు సంబంధించి దీపావళి అనేది టపాకాయలు కాల్చుకునే పండగే. అయితే కరీంనగర్‌లో మాత్రం ఓ వింత‌ విచిత్ర‌మైన ఆచారం ఉంది. అదేంటంటే స్మ‌శానం చుట్టూ సమాధులు అక్కడే పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు ఇదీ కరీంనగర్‌లో కనిపించే ఓ వింత‌ సాంప్రదాయం. చనిపోయిన తమ కుటుంబ సభ్యులను స్మరిస్తూ స్మశాన వాటికలోని వారి సమాధుల వద్ద ఇంటిళ్ల పాది దీపావళి వేడుకలు చేసుకుంటారు.

Deepavaliచనిపోపోయిన తమ వారి సమాధుల దగ్గర వారికి నైవేద్యాన్ని పెట్టి అక్కడే పిల్లాపాపలతో టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా జరుపుకోవడం కరీంనగర్‌లోని కొంత మందికి సంప్రదాయంగా వస్తుంది. కరీంనగర్ ఆదర్శనగర్‌లోని స్మశాన వాటికలో గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇలా స్థానికులు జరుపుకుంటున్నారు.

Deepavaliఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR