గౌతమ బుద్దిడికి ఈ ప్రదేశంలోనే జ్ఞానోదయం కలిగినదని చెబుతారు. ఇక్కడ బోధివృక్షము కూడా మనం చూడవచ్చు. మరి ప్రపంచంలోనే బుద్దుడి మొట్ట మొదటి ఆలయం అని చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బీహార్ రాష్ట్రం, గయా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుద్ధగయ అనే ప్రాంతం ఉంది. సిద్ధార్థుడు ఇక్కడే గౌతబుద్ధినిగా మారాడని చెబుతారు. అయితే గౌతమ బుద్దిడికి ఈ ప్రదేశంలోనే జ్ఞానోదయం కలిగినదని కనుక ఇది బుద్ధగయ గా పిలువబడుతుంది.
ఇక్కడి బుద్ధగయలో అన్నిటికన్నా అతిముఖ్యమైనది, అత్యంత పవిత్రమైనది బోధి వృక్షము. ఈ బోధివృక్షం ఉన్న ఆలయాన్ని మహాబోధి అని అంటారు. ఈ ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఇతర దేశాల వారు కట్టించిన బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. వీటిని జపాన్, టిబెట్, సిక్కిం వారు కట్టించిన ఆలయాలుగా చెబుతారు.
ఇక్కడి మహాబోధి ఆలయం బుద్దినికి సంబంధించిన వరకు ప్రపంచంలోనే మొట్టమొదటగా నిర్మించిన ఆలయం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఉన్న బోధివృక్షం అనగా రావిచెట్టు క్రింద కూర్చొని తపస్సు చేస్తుండగా సిద్ధార్థునికి జ్ఞానోదయం అయింది. అంటే బౌద్దమతం పుట్టుక ఈ వృక్షం క్రిందనే జరిగింది.
అయితే పూర్వం ఇక్కడ బోధివృక్షం మాత్రమే ఉండేది, కొంతకాలం తరువాత ఆ చెట్టు మొదట్లో అశోకుడు ఆసనం కట్టించాడు. దీనినే వజ్రాసనం అని అంటారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయం క్రి. శ. 640 లో నిర్మించబడింది గా చెబుతారు. ఇక్కడి ఆలయ ప్రవేశ ద్వారం రాతితో చెక్కిన తోరణాన్ని అశోకుడు నిర్మించాడు. ఇక్కడ దాదాపుగా అర టన్ను ఉన్న బరువు గల ఒక పెద్ద గంట ఉంది. దీనిని జపాన్ వారు ఇచ్చారు. ఇక 1991 లో అపప్టి శ్రీలంక అధ్యక్షుడు బోధివృక్షం చుట్టూ ఉన్న రాతి ప్రాకారంతో పాటు ఉన్న ఇత్తడి ప్రాకారాన్ని నిర్మించి ఇచ్చారంటా.
ఇలా ఎన్నో విశేషాలు ఉన్న బుద్దిని జ్ఞానోదయం అయినా ఈ అద్భుత క్షేత్రంలో ఉన్న బుద్దిడిని, ఈ పుణ్యప్రదేశాన్ని చూడటానికి విదేశాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు