రావణాసురుని తమ్ముడు కుంభకర్ణుడు. ఈయన ఒక భయంకర రాక్షసుడు. అయితే ఆరు నెలలకి ఒకసారి నిద్ర లేచి ఆరు నెలలకి సరిపడు ఆహారం ఆ ఒక్కరోజే తిని తిరిగి మరల ఆరు నెలలు నిద్రపోతాడని మన అందరికి తెలిసిన విషయమే. మరి కుంభకర్ణుడు ఇలా ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడు? బ్రహ్మ నుండి అయన పొంది వరం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రామాయణంలో రావణుడు, విభిషణుడు, కుంభకర్ణుడు ముగ్గురు కూడా సోదరులు. అయితే వీరు తండ్రి విశ్రావసుడి ఆజ్ఞతో దైవ అనుగ్రహం కోసం తప్పస్సు చేస్తుంటారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు గోరమైన తపస్సును చేస్తుండగా బ్రహ్మ దేవుడి ప్రత్యేక్షమై ముగ్గురిని వరాలు కోరుకోమంటాడు. అప్పుడు రావణుడు నాకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ దేవుడు అంగీకరించకపోవడం తో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, యక్షులు వల్ల మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. ఆ తరువాత విభీషణుడు తాను ఎప్పుడూ నీతి పాటిస్తూ ఉండేలా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. దీనికి సమ్మతించిన బ్రహ్మ అతడు కోరుకున్న వరాన్నే ప్రసాదిస్తాడు.
ఇక అతిభయంకర రాక్షసుడు అయినా కుంభకర్ణుడి విషయానికి వచ్చే సరికి దేవతలందరు బ్రహ్మ దగ్గరకి వచ్చి ఇలాంటి అతి భయంకర రాక్షసుడు వరాన్ని పొందితే లోకం సర్వ నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఏదో ఒకటి చేసి కుంభకర్ణుడు వరాన్ని ఆడకుండా చేసి ఈ ఆపద నుండి కాపాడాలంటూ విన్నవించుకుంటారు.
అప్పుడు బ్రహ్మ వారి విన్నపాన్ని అర్ధం చేసుకొని దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తూ తన సతీమణి అయినా సరస్వతి దేవి సహాయాన్ని కోరుతాడు. ఎప్పుడు అయితే కుంభకర్ణుడు వరాన్ని కోరుకుంటాడో ఆ సమయంలో అతని నాలుక ఉత్సరించకుండా చేయాలనీ ఆ దేవిని కోరతాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసం వరంగా కోరుకోవాలని పొరపాటున కుంభకర్ణుడు నిద్రాసనం అని అంటాడు దీనికి వెంటనే బ్రహ్మ తధాస్తు అని వరాన్ని ఇచ్చేస్తాడు.
ఆ సమయంలో రావణుడు బ్రహ్మ దేవునితో ఇలా ఎల్లప్పుడు కుంభకర్ణుడు నిద్రలో ఉండటం సరికాదు ఏదైనా నిర్ణిత సమయం ఉండేలా వరాన్ని ఇవ్వాల్సిందగా విన్నవించుకుంటాడు. అప్పుడు బ్రహ్మ సరే అంటూ, ఒక ఆరు మాసాలు పడుకొని ఒక రోజు మాత్రమే మేల్కొని ఆ రోజు ఆరుమాసాల ఆహారాన్ని భుజించి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు అని వరాన్ని ప్రసాదిస్తాడు.
అయితే కొన్ని రామాయణ కథల్లో రావణుడు రామునితో యుద్ధం చేసే సమయంలో కేవలం తొమ్మిది రోజుల్లోనే కుంభకర్ణుడిని నిద్రలో నుండి లేపి యుద్దానికి పంపిస్తాడని అంతేకాకుండా కుంభకర్ణుడు రాముడి చేతిలో మోక్షం లబించడానికే నిద్రలో నుండి లేసి యుద్దానికి వస్తాడని చెబుతారు.
ఈవిధంగా కుంభకర్ణుడు బ్రహ్మ దేవుని వరం పొంది చివరకు తన అన్న అయినా రావణాసురుని కోసం నిద్రలో నుండి లేచి యుద్ధంలో ప్రాణాలని కోల్పోతాడు.