కొత్తగా పెళ్ళైన వారు సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారు? 

వ్రతాలలో సత్యనారాయణస్వామి వ్రతానికి ఎంతో విశిష్టత వుంది. దాదాపు అందరి ఇళ్లలో ఈ వ్రతం  చేసుకుంటారు. అనేక కష్టాల నుంచి … నష్టాల నుంచి … బాధల నుంచి బయటపడేసే శక్తి ఈ వ్రతానికి వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, జీవితమనే సముద్రంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న వాళ్లని క్షేమంగా తీరానికి చేర్చే నావలా సత్యనారాయణస్వామి వ్రత ఫలితం పనిచేస్తుంది.
  • సాదారణంగా ఈ వ్రతాన్ని కార్తీకమాసంలో జరుపుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయి మొదట అత్తవారింట అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించటం అనాదిగా ఆచారంగా ఉంది.
  • సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణస్వామి భూమిపై ఆవిర్భవించారని అసాధారణమైన శక్తిని కలిగి ఉన్నారని భక్తుల విశ్వాసం.
  • కొత్తగా పెళ్ళైన దంపతులు వారి జీవన ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని వేడుకుంటూ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేసుకొనే సమయంలో ఆ ఊరిలో వారందరిని పిలుస్తారు.
  • ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది. కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారు. దాంతో కొత్తగా వచ్చిన కోడలికి బెరుకు పోయి తొందరగా అందరిలోనూ కలిసిపోతుంది. ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికి పరిచయం చేయటంను అత్తమామలు శుభ సూచకంగా భావిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR