ఎవ్వరికైనా రక్తపోటు ఎందుకు వస్తుంది ? దానికి గల కారణాలు

బీపీ (రక్తపోటు) అనేది జబ్బు కాదు కాని అది ఉండాల్సిన స్థాయి కన్న ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా పలు శరీర సమస్యలకు దారి తీస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన రేటు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేకపోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా, తరిగినా మంచిది కాదు.

రక్తపు పోటు అవధిని మించి పెరిగితే దానిని ‘అధిక రక్తపోటు’ అంటారు. హై బీపీ ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అదే విధంగా లోబీపీ ఉన్నవారికి గుండె జబ్బులు, పక్షవాతం లాంటి సమస్యలు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

blood pressureఎవ్వరికైనా రక్తపు పోటు ఎందుకు పెరుగుతుంది?’ అన్న ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. ఫ్యామిలీ హిస్టరీ, జెండర్, వయస్సు, జాతి… అన్నీ కొద్దో గొప్పో దోహదం చేస్తాయి. తల్లి దండ్రులకి, దగ్గర బంధువులకి ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. వయస్సు పెరుగుతూన్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకని బీపీని కంట్రోల్ లో పెట్టుకోవడం అందరి బాధ్యత. మన అలవాట్లని మార్చుకుని చాల వరకు రక్తపు పోటుని అదుపులో పెట్టవచ్చు.

మెడిటేషన్: టెన్షన్ పెట్టె విషయం వేధిస్తున్నా కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూచుంటే ఊరటగా ఉంటుంది. హై బీపీ ఉన్నవారు కూడా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా రోజు కనీసం 10 నిముషాలు మెడిటేషన్ చేస్తే బీపీ వల్ల కలిగే హైపెర్టెన్షన్స్ అన్ని పోతాయి.

ఎక్సర్సైజు చేయడం: 

blood pressure రెగ్యులర్ గా ఎదో ఒక ఎక్సర్సైజు చేయడం వలన బాడీ ఫిట్ గా ఉండటమే కాకుండా బరువు తగ్గటం లో ను దోహదపడుతుంది. వాకింగ్ లేదా జాగింగ్ కి వెళ్లలేని వారు ఆన్లైన్ లో లభ్యం అయ్యే ఎన్నో సైట్ ల లో యోగ వీడియోస్ చూస్తూ ఇంట్లోనే ప్రాక్టీస్ కూడా చేయచ్చు. ఇలా చేస్తూ ఉంటె బాడీ లో ఉండే కొవ్వు కరిగి హై బీపీ వల్ల వచ్చే సమస్యలన్నీ దూరం అవుతాయి.

ఆరోగ్యమైన ఆహారం తినటం:

Healthy Foodబయటికి వెళ్లిన ప్రతి సారి ఎదో ఒక జంక్ ఫుడ్ తినడం అనే అలవాటును మానుకోవాలి. ముఖ్యంగా గా కూల్డ్ డ్రింక్స్, చిప్స్, పిజ్జా, బర్గర్ ల లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉండే ఆహరం(చేపలు) తరచుగా తీసుకోవాలి. తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, పెరుగు, జ్యూస్లు, ఫైబర్ ఫుడ్ లాంటి పదార్ధాలు ఉండటం మంచిది.

ఆల్కహాల్ మరియు స్మోకింగ్ మానుకోవడం:

blood pressureహై బీపీ ఉండి మందులు వాడే వారు మద్యం సేవించడం, సిగరెట్ తాగటం వలన ఆ మందులు పూర్తిగా పనిచేయవు. సిగరెట్ మానేయడం వలన అది మీకే కాదు మీ బీపీ కి మరియు మీ ఎదుటి వారికీ మంచిది.

అధిక బరువు తగ్గటం:

blood pressure మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహరం తోనే ముడి పడి ఉంది. మనం ఎంత మంచి ఆహరం తీసుకుంటే అంత మంచి ఆరోగ్యం మన సొంతం. ఆహార అలవాట్లు హెల్తీ గా మార్చుకుంటూ తరచుగా ఒకసారి వెయిట్ చెక్ చేస్కుంటూ ఉండాలి. ఒకవేళ బరువు పెరిగితే మాత్రం కంట్రోల్ చేస్కోవాలి. అధిక బరువుతో హై బీపీయే కాదు గుండె కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి కాబట్టి బరువు ని అదుపులో ఉంచుకోవటం కంపల్సరీ.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR