కన్నయ్య ‘వెన్న’ ఎందుకు దొంగిలించేవాడు? అందులోని పరమార్ధం ఏమిటో తెలుసా..

అల్లరి కృష్ణుడు, కొంటె కృష్ణుడు, వెన్న దొంగ, వెన్న గోపాలుడిగా.. పలు రకాల పేర్లతో శ్రీ కృష్ణుడిని మనం పిలుస్తూ ఉంటాం. చెడును అంతమొందించి.. మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు. అప్పట్లో.. ఆయన తిరిగాడిన స్థలాన్ని ద్వారకా అని పిలుస్తూండేవారు. ఆ ఊరికి.. ఆ ఊరిలోని ప్రజలకు చిన్న కష్టమొచ్చిన నల్లనయ్య ముందుండేవాడు. తన అల్లరి చేష్టలతో.. విసుగుపుట్టించినా.. ఆ చిలిపి కృష్ణుడంటే.. వయసులో ఉన్న ఆడపిల్లలకు.. పెద్దవాళ్లుకు.. చిన్నవాళ్లకు సైతం అందరికీ ఇష్టమే.
జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తిని భగవద్గీతలో ప్రసాదించిన స్ఫూర్తిదాత చిన్ని కృష్ణయ్య. చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేసి తల్లి యశోద దగ్గర ఎన్నో చివాట్లు తిన్న ఆబాల కన్నయ్యను అందరూ వెన్నదొంగ అని కూడా పిలుస్తారు. అయితే కృష్ణుడు అందరి ఇళ్లలో వెన్నను దొంగలించి తినడం వల్ల కన్నయ్యకు వెన్నదొంగ అనే పేరు వచ్చింది.
కృష్ణుడు వెన్నను దొంగలించడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
చిన్ని కృష్ణుడు గోకులంలో అందరి ఇళ్లలో వెన్న దొంగలించడంతో పాటు, వెన్నలా, స్వచ్ఛమైన, మృదువైన అందరి హృదయాలను కూడా దొంగలించాడు.
వెన్న తెల్లగా ఉంటుంది. అలాగే మన హృదయాలు కూడా మచ్చలేనివిగా ఉండాలని, హృదయంలో కోపం, అహం, ద్వేషం, అసూయ వంటి వాటిని పోషించ కూడదని అందరి హృదయం వెన్నలా ఉండాలనే ఉద్దేశంతో చిన్ని కన్నయ్య వెన్న దొంగతనం చేశాడు.
అందుకే కృష్ణుడిని చిట్టా చోర్ ( హృదయాలను దొంగలించే వాడు) అని కూడా పిలిచేవారు. పెరుగును చూర్ణం చేసేటప్పుడు వెన్న తేలికగా పైకి వస్తుంది.
అదేవిధంగా మన మనస్సు భౌతిక ప్రపంచం నుండి వేరు చేయాలి. అంటే మనసు వెన్నలా తేలికగా ఉండాలి అని అర్థం.
చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోకులంలోని ఇళ్లలో వెన్నను దొంగతనం చేసి అందరి మధ్య ఐక్యతను చాటాడు. అంతేకాకుండా వారిలో ఎంతో శారీరక బలం చేకూర్చాడు. అందువల్ల కృష్ణాష్టమి వేడుకలు జరిగినప్పుడు ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ ఒకరిపై ఒకరు నిలబడి ఐక్యతను చాటి చెబుతూ ఉంటారు అని దీని అర్థం. చిన్ని కృష్ణుడు తన బాల్యంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ గోకులంలో అందరి మనసులు గెలిచేవాడు. కానీ తాను చేసిన పనులు క్షున్నంగా పరిశీలిస్తే అందులోని అంతరార్ధం తెలుస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR