తమలపాకుల హారాన్ని హనుమంతునికి వేస్తే ఎటువంటి ఫలితాలు పొందవచ్చు?

హనుమాన్ పూజ అనగానే ముందుగా గుర్తొచ్చేది సింధూరం, తమలపాకులు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.

tamalapaku pooja for hanumanఅప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. తమలపాకుల అభిషేకం గురించి మనకు తెలుసు అయితే తమలపాకుల హారాన్ని హనుమాన్ కి వేస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం.

tamalapaku pooja for hanumanలేత తమల పాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది.

ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.

స్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.

స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.

tamalapaku pooja for hanumanవ్యాపారం చేసే సమయంలో నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.

స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.

శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

tamalapaku pooja for hanumanవైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని రోగాలు నివారణ అవుతాయి.

సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.

హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.

వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హర ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR