పూజలు వ్రతాలు చేసేవారికి ఉల్లి, వెల్లుల్లి ఎందుకు నిషిద్ధం..?

బ్రాహ్మణుల కట్టుబాట్లు కఠినంగా ఉండటమే కాకుండా వీరి ఆహారపు అలవాట్లు కూడా కఠినంగానే ఉంటాయి. వీరు అస్సలు ఏ విధమైన మసాలాలూ తినరు. ముఖ్యంగా ఉల్లీ, వెల్లుల్లి వీరికి నిషిద్ధం. పూర్వీకులు ఎప్పుడూ వీటిని తినలేదు. బ్రాహ్మణులు అస్సలు వీటిని ఇంట్లొకి తీసుకొచ్చేవాళ్లు కాదు. వీరు మాత్రమే కాదు మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు,వ్రతాలు చేసుకునేటప్పుడు ఉల్లి,వెల్లుల్లి తినటం నిషేధం.
  • మసాలా లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆచారాలను నిష్టగా పాటించే వారు పూజల సమయంలోనే కాకుండా మాములు రోజుల్లో కూడా ఉల్లికి దూరంగా ఉంటారు. అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది. పర్వ దినాల్లోనే ఉల్లిని తినకూడదని ఎందుకు నియమాన్ని పెట్టారు? ఈ విషయం గురించి వివరంగా తెలుసుకుందాం….
  • ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకున్న ఆహారాన్ని సాత్వికం, రాజసికం, తామసికం అని మూడు భాగాలుగా విభజించారు. ఈ ఆహారాలను బట్టి మనిషిలో గుణాలను పెంచటమో తగ్గించటమో చేస్తుంది. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు రాజసికం గుణానికి సంబందించినవి.
  • ఈ ఆహారాలను తీసుకోవటం వల్ల సరైన ఆలోచనలు రాకపోవటం, ఏకాగ్రత లేకపోవటం, విపరీతమైన కోపం వస్తాయి. అందువల్ల ఎక్కువ ఏకాగ్రతగా చేసుకొనే పూజలలో ఉల్లి,వెల్లుల్లి,మసాలా వంటి ఆహారాలను నిషేదించారు.
  • అంతేకాక ఉల్లి, వెల్లుల్లి పెరిగే ప్రదేశాలు శుభ్రత లేకుండా ఉంటాయి. భగవంతుణ్ణి భక్తితో కొలిచే సమయంలో ఇలాంటి ఆహారాన్ని తీసుకోవటం తప్పుగా భావిస్తారు. అందుకే పూజలు చేస్తున్న సమయంలోఉల్లి, వెల్లుల్లి వంటి వాటికీ దూరంగా ఉండమని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR