తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వరుసలో గోవు నడవడానికి కారణం?

గోవులో సకలదేవతలు ఉంటారు. తల్లిపాల తర్వాత అంతటి శక్తినీ, మేధాశక్తినీ ఇవ్వగలవి గోక్షీరాలే. అందుకే పంచామృతాలలో నేయి పెరుగులనే వాడతారు. సంస్కృతంలో ‘గో’ శబ్దానికి పుంలింగం ‘ఎద్దు’ అనీ, స్త్రీలింగం ‘ఆవు’ అని అర్థం. ఎద్దును, ఆవును కలిపి చెప్పే పదం సంస్కృతంలో ఒకటే- అదే “గో” అనేది. ఆవు పాడికి సంకేతం. ఇలా గోవుకు సంబంధించి ఎన్నెన్నో విశేషాలున్నాయి. అందుకే అంతటి పవిత్రమైన గోవు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వరుసలో గోవు నడుస్తుంది.

Srivari Brahmotsavamఇక శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కథలోకి తొంగిచూస్తే, గోవుపాలను తాగి శ్రీనివాసుడు చాలాకాలం జీవించాడు. పద్మావతీ శ్రీనివాసుల కథలో గోవుపాత్ర ఎక్కువేనని బ్రహ్మోత్సవంలో కదిలే గోవులే చెబుతుంటాయి. అదిగాక తెల్లగా ఉండే గోవు సత్త్వగుణానికి చిహ్నం. అందుకే ఆవు సాధువుగానే ఉంటుంది.

Srivari Brahmotsavamతిరుమల శ్రీవారి స్వామి ఊరేగింపును దర్శిస్తున్న భక్తులు సత్త్వగుణంతో ఉండండి అని మూలార్ధం. సాధువులుగా మేముంటున్న కారణంగానే దేవతలు మాలో నివసిస్తున్నారు అని చెప్పకనే చెబుతుంటాయి.

Srivari Brahmotsavamగోవులకంటే ఐదురెట్లు ఒక ఈతలో కంటున్నప్పటికీ మా సంతానానికి మించి ఏ పులిజాతీ, సింహజాతీ ఏ ఖండంలోనూ ఉండడం లేదు. కాబట్టి ధర్మమే జయిస్తుందనే విషయానికి మేమే సాక్ష్యం అని మౌనంగా చెబుతూ శ్రీ వేంకటేశుని ఆలయంలో సూక్తి- ధర్మో రక్షతి రక్షిత”ను పదే పదే గుర్తుచేస్తుంటాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR