అష్టమి, నవమి తిథుల్లో శుభకార్యాలు ఎందుకు చేయరు?

ఏదైనా శుభకార్యం చేయాలంటే కచ్చితంగా ఉండాల్సింది మంచి ముహూర్తం. ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే అమావాస్య, అష్టమి, నవమి, చతుర్దశి లాంటి తిథులలో శుభకార్యాలకు ముహూర్తం ఉండదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇలా సందేహం రావడానికి కారణం ఉంది. జ్యోతిష శాస్త్రం కొన్ని తిథులను వాడకూడదని నిర్దేశించింది. ఉభయ పక్షాలలోని విదియ, తదియ, పంచమి , సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి మాత్రమే ముహూర్తాలకు యోగ్యమైనవి. ఈ తిథులలో కూడా శుక్ల పక్ష పంచమి నుంచీ కృష్ణ పక్ష దశమి వరకూ మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కృష్ణ పక్ష త్రయోదశి వాడకం కూడా తక్కువనే చెప్పాలి.

అష్టమి, నవమిముహూర్త భాగంలో తిథి, వారం, నక్షత్రం, లగ్నం, యోగం , కరణం అనే అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. వీటిలో లగ్నం అన్నది చాలా చాలా ముఖ్యమైనది. మనం ఏ కార్యం కోసం ముహూర్తం వెతుకుతున్నాము అన్న దాన్ని బట్టి వారం, నక్షత్రం, లగ్నం మారుతాయి.ఉదాహరణకు వివాహానికి వృషభ, మిథున, కర్కటక, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన లగ్నాలు ముహూర్త శాస్త్రం నిర్దేశించింది. బుధ, గురు, శుక్ర వారాలు పనికివస్తాయి. నక్షత్రాల విషయానికి వస్తే రోహిణి, మృగశిర, మఖ,ఉత్తర , హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి లలో వివాహ ముహూర్తాలు పెడతారు.

అష్టమి, నవమిఆదే గృహప్రవేశానికి అయితే వృషభ, మిథున, కన్య, ధనుస్సు, మీన లగ్నాలు మాత్రమే ఆమోదిస్తారు. మఖ నక్షత్రము వివాహానికి పనికివస్తుంది, కానీ గృహప్రవేశానికి ఆ రోజున లగ్నం పెట్టరు. అలాగే, శతభిషం ఉన్న రోజున గృహప్రవేశం చేస్తారు ..కానీ ఆ నక్షత్రం వివాహానికి పనికిరాదు.అలాగే పెద్దలు అష్టమి, నవమి రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని నమ్ముతారు. పూర్వం అష్టమి, నవమి తిథులు మహావిష్ణువుతో తమ గోడును వినిపించుకున్నాయట.

అష్టమి, నవమిఅష్టమి, నవమిల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్లేదని అవి వాపోయాయట. ఆ సమయంలో విష్ణు భగవానుడు.. అష్టమి, నవమి తిథులను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. దీని ప్రకారం వాసుదేవుడు- దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథిలో కృష్ణుడు జన్మించాడు. ఆ రోజు శ్రీ కృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు. ఇక నవమి తిథిలో దశరథుడు-కౌసల్య దంపతులకు కుమారుడిగా శ్రీరాముడు జన్మించాడు. రామనవమి రోజున కూడా ప్రజలు పండగ చేసుకుంటారు. కానీ నవమిలో జన్మించిన రాముడు అరణ్య వాసం చేశాడు. ఇంకా సీతమ్మను విడిచి తీవ్ర దుఃఖాన్ని అనుభవించాడు.

అష్టమి, నవమిఇందుకు నవమి తిథిలో జన్మించడమే కారణం. అందుకే నవమి తిథిలో శుభకార్యాలు ప్రారంభించరు. అయితే దైవ కార్యాలకు మాత్రం ఈ తిథి ఉత్తమం. ఇకపోతే.. అష్టమిలో జన్మించిన కృష్ణుడు కూడా తల్లిదండ్రులకు దూరంగా యశోద మాత వద్ద ముద్దుగా పెరిగినా.. కంసునిచేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ రెండు తిథులు శుభకార్యాలకు ఉత్తమమైనవి కావని పండితులు చెప్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR