పుణ్యక్షేత్రాలకు వెళ్ళినపుడు ఎరుపు, పసుపు, నారింజ రంగు దారాలు ఎందుకు కడతారో తెలుసా?

హిందూ ధర్మం ప్రకారం ప్రతి సాంప్రదాయానికి ఒక అర్థం కచ్చితంగా ఉంటుంది. అందుకే వాటి వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటివి ఆచరించడం వల్లనే తమకు మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో మనం ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శించినపుడు అక్కడ ఎరుపు, నారింజ, పసుపు రంగు దారాలు దర్శనం ఇస్తాయి.

mauli threadsఅక్కడికి వెళ్లే భక్తులు ప్రసాదంతో పాటు ఆ దారాలను కూడా కొని చేతికి కట్టుకుంటారు. అలా కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని, ఎలాంటి పీడ కలలు రావని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే ఆ రంగు దారాలనే ఎందుకు కడతారో మీకు తెలుసా? ఆ రంగు దారాలను చేతికి కట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఆ ధారాలను ఏమని పిలుస్తారు? వీటి గురించి ఇప్పుడు చూద్దాం…

మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు నారింజ పసుపు ఎరుపు ఈ మూడు రంగులు కలిపి ఉన్న దారాలు మనకు కనిపిస్తాయి. ఆ ధారాలను “మౌళి” అంటారు. అసలీ దారాలను మౌళి అని ఎందుకంటారో తెలుసుకోవాలంటే ముందుగా మనం బలి చక్రవర్తి కథ గురించి తెలుసుకోవాల్సిందే…

mauli threads red orange and yellow threadబలిచక్రవర్తి రాక్షసుల రాజు అయినప్పటికీ దానం చేయడంలో ఎంతో సహృదయం కలవాడు.
అయితే బలిచక్రవర్తిని అంతమొందించడానికి శ్రీమహా విష్ణువు వామన అవతారం ఎత్తి బలి చక్రవర్తిని ఒక వరం అడుగుతాడు. అందుకు బలిచక్రవర్తి ఒప్పుకోగా వామనుడు మూడు అడుగుల స్థలం కావాలని కోరుతాడు.

అందుకు బలి తీసుకోమని చెప్పగా అప్పుడు వామనుడు ఒక అడుగు ఆకాశంపైన, మరొక అడుగు భూలోకంపై మరొక అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిచక్రవర్తిని అడగగా, అందుకు బలి తన తల మీద పెట్టమని వామనుడికి చెబుతాడు. అలా వామనుడు బలి తల మీద కాలు మోపి, బలి చక్రవర్తిని పాతాళానికి తోక్కేస్తాడు.

baliబలిదానానికి మెచ్చిన వామనుడు బలి చక్రవర్తికి మృత్యుంజయుడుగా వరమిచ్చి మౌళి అనే దారాన్ని కడతాడు. ఈ దారం కట్టుకోవడం వల్ల మృత్యుంజయుడుగా వర్ధిల్లుతారని నమ్మకం.
అంతేకాకుండా ఎటువంటి చెడు కలలు రాకుండా, భయబ్రాంతులకు గురి కాకుండా ఉండడం కోసం ఈ మౌళి అనే దారాన్ని చేతికి కట్టుకుంటారు.

navgraha doshaluమౌళి అనే దారాలు ఎరుపు పసుపు నారింజ రంగులో ఎందుకు ఉంటాయి అంటే, నవగ్రహాలలో బుధుడు, సూర్యుడు, కుజుడు ఈ ముగ్గురు ఆ ధారాలలోని రంగులలో ప్రతిబింబించడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు లేకుండా, ఎలాంటి గ్రహపీడ దోషాలు లేకుండా సుఖంగా ఉంటారని ఈ దారాలను చేతికి కంకణంలాగా కడతారు.
మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమచేతికి ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR