పెళ్లి తరువాత మహిళలు కొన్ని ఆభరణాలు ధరిస్తారు. మంగళసూత్రం, కాలి మెట్టెలు, నల్లపూసలు, అయితే ఒక్కో దానికి ఒక్కో విశిష్టత ఉంటుంది.. వాటిల్లో నల్లపూసలు ముఖ్యమైనది. గతంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద వచ్చే ఉష్ణాన్ని పీల్చుకునేవి. కాని ఇప్పుడు ఇలా తయారు చేయడం లేదు. బాగా శాస్త్రం తెలిసిన వారు కొందరు కావాలని ఇలా తయారు చేయించుకుంటున్నారు.
ఇక నల్లపూసలు వేసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది అని భావించి అవి ధరించేవారు..పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు.
ఆ మంగళ సూత్రానికి వధూవరులచే నీలలోహిత గౌరి కి పూజలు చేయిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల ఆ వధూవరులకి ఆ నీలలోహిత గౌరి దేవి అనుగ్రహం ఉంటుంది, దీని వల్ల వారు జీవితాంతం కలిసి ఉంటారు అని చెబుతోంది శాస్త్రం…
ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. కాని ఇప్పుడు సాధారణంగానే నల్లపూసలు రెడీమేడ్ లో బంగారు దుకాణాల్లో కొనుగోలు చేసి ధరిస్తున్నారు.