“ఆకాశాన్నాక్రమించిన ఆయన భావనాపాదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషాపాదానికి భక్తితో అంజలి ఘటిస్తూ “నా మూడో పాదాన్ని నీ నెత్తిన పెడతా” అంటున్న ఆయన తాండవ పాదానికి భయంతో నమస్కరిస్తూ, ముమ్మారు మొక్కుతూ
~ Sirivennela about Veturi
వేటూరి గారు మీరు రాసిన ప్రతి పాట, ప్రతి అక్షరం వింటే గాని అర్థంకాదు తెలుగు ఎంత కమ్మంగా ఉంటుందో అని… ఒక్కో అక్షరం పవిత్ర శిఖరాలు చేరుతాయి, మీ చెయ్యి తాకి..
“అక్షరం తెలుగు వేటూరి”
శేఖర్ కమ్ముల, వేటూరి గారి కలయిక లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. శేఖర్ గారి సినీ జీవితాన్ని ఆది నుంచి అక్షరాలతో నెత్తి మీద మోసిన శివుడు వేటూరి గారు.
ఈ కింద ఆర్టికల్ లో శేఖర్ కమ్ముల వేటూరి గారు మరణించాక, అయ్యో క్షమించండి వేటూరికి మరణం ఏంటి? నింగికి నేలకి నీరుకి భాషకి భావానికి మరణం ఉంటుందా! వాటికి మరణం లేనప్పుడు వేటూరి గారికి మరణం లేదు… తెలుగు ఈ నేల మీద ఉన్నత కాలం, వేటూరి గారు మనకి కనపడకపోయిన ఇక్కడే ఉంటారు… తెలుగు భాష, వేటూరి వేరు వేరు కాదు…
ఈ కింద ఆర్టికల్ లో శేఖర్ గారు వేటూరి గారితో సినీ ప్రయాణం ఎలా మొదలైందో, వేటూరితో సంభాషణలు, పాటలా కథలు ఎన్నో ఉన్నాయి…