18 Rojula paatu ee aalayamlo uthsavaalu ela jaruputharo thelusa?

0
4621

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ 18 రోజుల ఉత్సవం ధర్మరాజు పట్టాబిషేకంతో ముగుస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఉత్సవాలు ఎలా చేస్తరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. uthsavaaluఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూరు జిలాలోని అనేక ధర్మరాజు ఆలయాల్లో యామిగాని పల్లెలో లో ద్రౌపతి ఆలయం ఉంది. ధర్మరాజు ఆలయాల్లో ఈ ఆలయం అతి ముఖ్యమైంది. ఈ ఆలయాన్ని దాదాపు 5 , 6 శతాబ్దాలకు పూర్వమే నిర్మించినట్లు స్థానికుల అభిప్రాయం. uthsavaaluఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నుండి బహుళ అష్టమి వరకు 18 రోజులు ధర్మరాజు తిరునాళ్ళు ఎంతో వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ తిరునాళ్లు ఉత్సవం అంకురార్పణతో ప్రారంభమై తిలక తర్పణంతో ముగుస్తుంది. uthsavaaluఈ తర్పణం ఉత్సవాన్ని గౌడ బ్రాహ్మణులూ తొలి రోజు అంటే అంకురార్పణ రోజున పసుపు బట్టలు ధరించి ఆలయంలో పూజలు జరిపి ఉత్సవాలు జరిగే 18 రోజులు ఆలయంలోపలే నివాసముంటారు. ఈ ఉత్సవం సమయంలో పూజారులు స్త్రీలు వండిన భోజనాన్ని స్వీకరించరు. ఉత్సవ పర్వదినాలలో 12 రోజులు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉదంక చరిత్రతో ప్రారంభించి, ధర్మరాజు పట్టాభిషేకం వరకు మహాభారత పురాణశ్రవణం జరుగుతుంది. uthsavaaluఈ ఉత్సవంలో పేర్కొనదగిన ఘట్టాలు 9 వ రోజు జరిగే బకాసురవధ, 13 వ రోజు జరిగే ధర్మరాజు రాజసూయయాగం, 14 రోజున అర్జున తపస్సు, 18 వ రోజు దుర్యోధన వధ ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించబడతాయి. ఈ ఉత్సవాలలో ఉత్తర గోగ్రహణం, శ్రీకృష్ణరాయబారం ఘట్టాల పురాణ కాలక్షేపం భక్తులనెంతో ఆకర్షిస్తుంది. uthsavaaluఇక చివరి రోజు సాయంత్రం పూజారులు వేపాకు, పసుపు కుంకుమలతో పూజించిన కుండలతో ఏడు బావుల నీటిని తోడుకొని తెచ్చి, పూజారులు ఆ కుండలను నెత్తి మీద పెట్టుకొని అప్పటికే ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ మైమరచి నృత్యం చేస్తారు. దీన్నే గార్గేయ పూజ అంటారు. uthsavaaluఇలా 18 రోజుల ఉత్సవం చివరి రోజున ధర్మరాజు పట్టాభిషేకంతో ముగిస్తుంది.