ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని జీర్ణం చెయ్యటానికి శరీరంలో కొన్ని చర్యలు జరుగుతాయి. మెదటగా మెదడు లోని రక్తం, తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది. అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందు వలన నిద్ర వస్తుంది.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలుమధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవాలి. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయాలి. ఇక రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి. వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలుఅంతేకాదు పడుకునే విధానం కూడా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పడుకునేటప్పుడు ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి. దీనిని వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు. మన శరీరంలో సూర్యనాడి, చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి. సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనిచేస్తుంది. ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలుఅలసత్వానికి గురైయినపుడు, ఇలా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన అలసత్వం తొలగి పోతుంది. రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు . ఎడమవైపున పడుకోవడం వలన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనివల్ల

1. గురక తగ్గిపోతుంది.

2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయానికి, కడుపులోని పిండముకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది.

3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది.

4 . వెన్ను నొప్పి, వీపు , మెడ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన కలిగే ప్రయోజనాలు5 . శరీరంలో వున్న విషాలని, వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .

6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయబడతాయి.

7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి.

8 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .

9 . గుండెలోని మంటను నిరోధిస్తుంది. కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి.

10 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .

11. కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .

12. మెదడు చురుకుగా పని చేస్తుంది .

13. పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది.

14. ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR