పీరియడ్స్ త్వరగా ఆగిపోవటం డయాబెటిస్ కి కారణమా

ఒంటికి చిన్న గాయమైతేనే మనం ఓర్చుకోలేం. అలాంటిది నెలలో ఐదు రోజులు మాత్రం మహిళలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా చికాకు పెట్టే అంశం నెలసరి. మహిళల్లో ఎంతో ముఖ్యమైన ఈ ప్రక్రియ క్రమపద్ధతిలో లేకపోయినట్లయితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరికి తీవ్ర రక్తస్రావం, కడుపునొప్పి లాంటి సైడ్ ఎఫెక్టులు ఇబ్బందిని కలిగిస్తాయి. కానీ రుతుస్రావం లేదా మోనోపాజ్ వల్ల మహిళలకు టైప్-2 డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదముందట.

periods the cause of diabetes40 ఏళ్లకు ముందే రుతుస్రావం ఆగిపోతే దాన్ని ఎర్లీ మోనోపాజ్ అని అంటారు. వైద్య అవసరాలకు అండాశయాలు తొలగించినట్లయితే అప్పుడు కూడా రుతుస్రావం ఆగిపోవచ్చు. అయితే ఇలా ఏ కారణంతో అయినా పీరియడ్స్ ఆగిపోయినట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్ది ఆడవారిలో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా రుతుస్రావం సరిగ్గా కాకపోవచడం, సరైన సమయానికి అండం విడుదల కాకపోవడం లాంటివి సంభవిస్తాయి. ఈ దశనే మోనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ కు సగటు వయసు 45 ఏళ్లు.

periods the cause of diabetesఅలా కాకుండా మహిళల రుతుస్రావ ప్రకియ 40 ఏళ్లకు ముందే ఆగిపోయినట్లయితే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువ ఉందని ఓ అధ్యయనంలో తేలింది.

periods the cause of diabetesఒకవేళ ఇంతకుముందే మహిళలకు టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్దారణ అయినట్లయితే ఆమె ప్రీమెచ్యూర్ మోనోపాజ్ ను అనుభవించాల్సి ఉంటుంది. ఇందుకు కుటుంబ చరిత్ర, వయస్సు, ఉబకాయం లాంటివి కూడా ప్రధాన కారకాలుగా పరిగణిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR