మీ చేతులు ముడతలు లేకుండా మృదువుగా చేసుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి

చర్మ సంరక్షణ అంటే ముందుగా ముఖ సౌందర్యమే. అందం అంటే ముఖం మాత్రమే అందంగా కనిపించడం అని చాలామంది భావిస్తుంటారు. అందుకే ముఖంపైనే ఎక్కువ శ్రద్ధగా చూపిస్తారు. నిజానికి వయస్సు పెరగే కొద్ది ఆ లక్షణాలు కేవలం ముఖంపై మాత్రమే కనిపించవు. చేతులు, కాళ్లు ముడుతలుగా ఏర్పడటం అందులో ముఖ్యమైన సమస్య.

benefits of wrinkle-free soft handsమృదువుగా ఉండాల్సిన చేతుల్లో ముడుతలు ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. వీటి నుండి బయటపడి చేతుల్ని మృదువుగా చేసుకోవడానికి ఈ చిట్కాలను వాడి చూడండి. లేజర్ చికిత్సలు చర్మం యొక్క ఉపరితలంపై చేయబడతాయి, ఇది నల్ల మచ్చలు, గీతలు వదులుగా ఉండే చర్మం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.

benefits of wrinkle-free soft handsహైలూరోనిక్ ఆమ్లం కలిగిన డెర్మల్ ఫిల్లర్ ద్వారా ముడుతలు తగ్గించవచ్చు. మృదువైన చర్మం కోసం మేలైన పద్దతుల్లో ఇది కూడా ఒకటి.

కొవ్వు బదిలీ పద్ధతిలో, కొవ్వు కణాలు కడుపు లేదా తొడ వంటి శరీర భాగం నుండి తీసుకోని వాటిని ప్రాసెస్ చేసి రోగి చేతిలో ఇంజెక్ట్ చేస్తారు. ఏదైనా సమస్య వచ్చిన తరువాత పరిష్కారం వెతికే కంటే ఆ సమస్య రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక్కడ కూడా అంతే. అసలు చేతులు ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

benefits of wrinkle-free soft handsఇంట్లో వస్తువులను శుభ్రపరుస్తున్నప్పుడు గానీ రసాయనాలతో ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు గానీ గ్లవ్స్ ధరించడం మంచిది. రసాయనాల కారణంగా చర్మం మృదుత్వం కోల్పోతుంది.

  • పొడిగా ఉన్న చేతులకి మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోకండి.
  • ఇంటి నుండి బయటకి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ మర్దన చేసుకోండి.
  • రాత్రిపూట పడుకునే ముందు విటమిన్ సి, ఈ, బీ3 గల సీరమ్స్ అప్లై చేసుకోవాలి.
  • ఈ పద్దతులన్నీ చేతుల మీద ముడుతలు పోగొట్టడానికి బాగా సాయపడతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR