డైట్ ఫాలో అయ్యేవారు రైస్ కి బదులు రోటి, చపాతీ లాంటివి తింటూ ఉంటారు. ముఖ్యంగా చిరుధాన్యాలు తీసుకుంటున్నారు. రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరుగుతోంది, అందుకే చాలా మంది తక్కువ కొలెస్ట్రాల్ వచ్చేలా ఫుడ్ తీసుకుంటున్నారు. ఇదివరకు కొన్ని ప్రాంతాల్లోనే తినే జొన్నరొట్టె ఇప్పుడు అందరూ తింటున్నారు. జొన్నలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.
రోజూ జొన్నలు తినడం మంచిదని, రోజూ జొన్నరొట్టెలు తినేవారిలో జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని చెబుతున్నారు వైద్యులు, దీని వల్ల ఎలాంటి రోగాలు రావు. బరువు పెరగరు. అధిక ఊబకాయ సమస్యలు రావు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడతాయి. బీ6 విటమిన్ జొన్నల్లో ఉంటుంది.
ఇక షుగర్ సమస్య ఉన్నవారు ఇలా జొన్న రొట్టె తింటే చాలా మంచిది. జొన్న రొట్టెలు నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. వీటితో కూరగాయ కర్రీ, పప్పు తింటే ఎలాంటి సమస్య ఉండదు. జొన్నలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.