ఈ దేవాలయంలో ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహం ఎంతో సుందరంగా ఉంటుంది. ఒక కొండపైన వెలసిన ఈ ఆలయంలో విశేషం ఏంటంటే హరిజనులకు ప్రవేశం కల్పించిన మొట్టమొదటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రం, మండ్య జిల్లా, పాండవపురం తాలూకాలో మేల్ కోట అనే పవిత్ర క్షేత్రం కలదు. ఇది మైసూరుకు సుమారు 51 కి.మీ. దూరంలో ఉంది. ఇచ్చట యదుగిరి కొండపై చెలువనారాయణ దేవాలయం ఉన్నది. ఈ ఆలయానికి ఎదురుగా కావేరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది అతి పురాతనమైన వైష్ణవ ఆలయంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనినే చాళ్లపిళ్ల రాయ దేవాలయం అని కూడా అంటారు.ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒకసారి శ్రీరామానుజులు చోళ చక్రవర్తిచే దండింపబడ్డాడు. అప్పుడు రామానుజులు తప్పించుకొని చోళరాజ్యం నుండి పారిపోయి మేల్ కోటలో తలదాచుకుని అక్కడ పది సంవత్సరాల పాటు ఉన్నారు. అందువల్ల మేల్ కోట ఒక గొప్ప యాత్ర స్థలంగా మారింది. అయితే శ్రీ రామానుజులకు శ్రీకృష్ణుడు స్వప్నంలో ప్రత్యక్షమై తనను ఢిల్లీ సుల్తానులు తీసుకొని పోయిరి అని చెప్పగా శ్రీ రామానుజులు సుల్తానును సందర్శించుకొనుటకు వెళ్లారు.అప్పుడు అక్కడ సుల్తాను కుమార్తె అందమైన శ్రీకృష్ణ విగ్రహాన్ని పుష్పములతో అలంకరించి ఆడుకొనుచుండెను. ఆ సమయంలో రామానుజులు ఆ విగ్రహాన్ని తనకు అమ్మమని అర్దించగా దానికి సుల్తాను ఇష్టపడలేదు. అప్పుడు రామానుజులు ధ్యాన నిమగ్నుడై యోగ శక్తితో అందరూ చూస్తుండగా చల్ల పిళ్ల రాయ శ్రీకృష్ణా రమ్మని ప్రార్ధించి పిలువగా ఆ దివ్యసుందరమూర్తి నృత్యం చేస్తూ వచ్చి శ్రీ రామానుజుల ఒడిలో చేరాడు.అప్పుడు సుల్తాను మరియు సభికులు ఆశ్చర్యపోయి రామానుజులను మెచ్చుకొని భక్తి పూర్వకంగా ఆ విగ్రహామును ఆయనకు ఇచ్చారు. అప్పుడు శ్రీరామానుజులు ఆ విగ్రహమును మేల్ కోటకు తీసుకువచ్చి అచట దేవాలయంలో ఉత్సవ విగ్రహంగా ప్రతిష్టించారు. ఇక సుల్తాను కుమార్తె ఆ దివ్య విగ్రహ వియోగాన్ని భరించలేక అపరితమైన కృష్ణ భక్తితో మేల్ కోట చేరి అచ్చట స్వామిని నిత్యం సేవిస్తూ చివరకు అక్కడే లీనమైంది. ఆమె జ్ఞాపకార్థం ఇచ్చట ఒక దేవాలయం కూడా నిర్మించబడింది.అయితే మేల్ కోట దేవాలయం చారిత్రకంగా హరిజనులకు ప్రవేశం కలిగించిన మొట్ట మొదటి దేవాలయం. ఎందుకంటే శ్రీకృష్ణా విగ్రహమును ఢిల్లీ సుల్తానుల నుండి తీసుకువచ్చుటకు ఆనాడు హరిజనులు శ్రీరామానుజులకు ఎంతోగానో సహాయపడ్డారు. అందుచే శ్రీ రామానుజులు ఆనాటి నుండి హరిజనులకు ఇచ్చట దేవాలయ ప్రవేశ సౌకర్యం కలిగించియున్నారు. అంతేకాకుండా శ్రీరామానుజులు మొట్టమొదటి సంగ సంస్కర్త గా చెబుతారు.ఈ విధంగా వెలసిన శ్రీకృష్ణుడి చెలువనారాయణ దేవాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.