Tirupathini polivunde shivakeshavathamanga virajilluthunna aalayam

0
2454

శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శమిస్తున్న ఈ ఆలయంలో శివుడికి కూడా ఒక ఆలయం ఉండటం వలన ఈ క్షేత్రం శివకేశవధామంగా విరాజిల్లుతుంది. మరి ఇద్దరు మూర్తులు కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? తిరుపతి ఆలయానికి ఈ ఆలయానికి మధ్య ఉన్న పోలిక ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. tirupathiతెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనిలో శ్రీ వెంకటేశ్వరాలయం ఉంది. 1984 వ సంవత్సరం కార్తీక మాసంలో ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగినట్లు తెలియుచున్నది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న విధంగా ఈ ఆలయం కూడా నాలుగు మాడ వీధులు కలిగి ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే శివునికి కూడా ఒక ఆలయం ఉంది. tirupathiఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉండి, ఎత్తైన ద్వజస్థంభంతో విరాజిల్లుతుంది. ఈ ధ్వజస్తభం చుట్టూ భక్తులు ప్రదిక్షణలు చేస్తారు. ధ్వజస్థంభానికి దిగువున తిరునామం ఉంటుంది. ధ్వజస్థంభానికి సమీపంలో బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి విధేయుడైన భక్తుడు, గరుత్మంతుని దర్శనం సకల పుణ్య ఫలాలను ఇస్తుందని అంటారు. tirupathiగర్భాలయానికి ప్రాంగణంలో ద్వారానికి ఇరువైపులా జయవిజయములు కొలువుదీరి ఉన్నారు. ఇంకా గర్భాలయంలో స్వామివారు తన దేవేరులతో కలసి భక్తులకి దర్శనమిస్తారు. స్వామివారి సన్నిధిలో పంచలోహ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఆగమ సంప్రదాయానుసారంగా ఎక్కడ లేని విధంగా స్వామివారికి ప్రతిరోజు పూజలు అభిషేకాలు జరుగుతాయి. జల, క్షిర, ఫల, పుష్పాదులతో అభిషేకాలను నిర్వహించి ఆరాధిస్తారు. 4 thirupathini poliunde shivakeshavadhamga virajilluthunna alayamఇక్కడ వెలసిన శివలింగాన్ని దర్శిస్తే సర్వశుభదాయకం. ఇంకా ఈ ప్రాంగణంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి వెండిగధతో, సంజీవిని పర్వతాన్ని మోస్తున్నట్లుగా భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఆలయ సముదాయానికి ప్రక్కన నవగ్రహ మంటపం ఉంది. ఈ ప్రాంగణంలోనే స్వామివారికి కళ్యాణమంటపం ఉంది. tirupathiఇక్కడ కొలువై ఉన్న వేంకటేశ్వరస్వామికి ఇక్కడ నిత్యకల్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వార దర్శనం, బోగిపండుగ నాడు గోదాదేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు.tirupathi