Bhumiki Dheguva Athi Chinna ShivaLingam

హిందువుల ఆరాధ్య దైవం శివుడు. మన దేశంలో పరమశివుడు కొలువై ఉన్న ఆలయాలు లక్షల్లో ఉన్నవి. అయితే ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలోని శివలింగం భూమికి దిగువ భాగంలో అతి చిన్నదిగా ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ShivaLingamతెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, సికింద్రాబాద్ రైల్వెస్టెషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో కంటోన్మెంట్ ప్రాంతంలో శ్రీ కోటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయమని చెబుతారు. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడింది. అయితే ఇక్కడ గర్భాలయం ఒక గుహ వలె ఉంటుంది. ShivaLingam
ఇక ఆలయంలోని శివలింగం చాలా పురాతనమైనదిగా తెలుస్తుంది. ఈ శివలింగం చాలా చిన్నదిగా భూమికి దిగువభాగంలో ఉంటుంది. ఆలయం మధ్యలో గల గర్భాలయం కొంచెం ఎత్తులో ఉంటుంది. ఆలయంలో రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పువైపు ఉన్న ద్వారం నుండి ప్రవేశించగానే సంజీవిని పర్వతంతో కూడిన ఆంజనేయస్వామి వారు మనకి దర్శనమిస్తారు. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ShivaLingam
ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, అమర్నాథ్ లోని గుహాలయాన్ని పోలిన ఆలయం యొక్క నమూనా ఇచట ఉంది. ఈ ఆలయంలోనే మంచులింగమును కూడా మనం దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక వృక్షమునకు అనేక గంటలు వ్రేలాడుతూ కనబడతాయి. ఈ గంటలను శిక్షణలో ఉన్న సైనికులు కట్టినట్లుగా చెబుతారు. ఈ వృక్షం క్రింద యమధర్మరాజు, దుర్గామాత విగ్రహాలు ఉన్నాయి. ShivaLingamఇలా వెలసిన ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.ShivaLingam

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR