18 అడుగుల శివలింగానికి ఒక్క గ్లాస్ నీటితో అభిషేకం! ఎక్కడంటే??

పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును.

shiva lingaస్వామివారి అనుగ్రహం మనపై కలగాలంటే స్వామివారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేస్తే చాలు స్వామివారు ప్రసన్న మయి మన కోరికలను తప్పక నెరవేరుస్తామని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే పరమశివుడికి ఎంతో మంది భక్తులు వివిధ రకాల అభిషేకాలు చేయడం మనం చూస్తున్నాం. కానీ మన కోరికలు నెరవేరాలన్నా, సమస్యలు తీరిపోవాలన్న భూతేశ్వర్ నాధ్ ఆలయం సందర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి ఒక గ్లాసు నీటితో అభిషేకం చేస్తే చాలు మన సమస్యలు తీరిపోతాయి.
మరి ఈ ఆలయంలో ఉన్న స్వామివారి మహిమ ఏమిటి? ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం…

shiva templeఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని మరోడా గ్రామంలో భూతేశ్వరనాధ్ ఆలయం ఉంది.
ఈ శివలింగానికి గ్లాస్ నీటితో అభిషేకం చేస్తే చాలు సమస్యలు తీరిపోతాయి.

చుట్టూ దట్టమైన అడవులు, అందమైన వాతావరణం మధ్యలో స్వామి వారు లింగాకారంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తులో శివలింగం మనకు దర్శనమిస్తుంది.

shiva templeఈ ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుందని, ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిఏటా శివలింగం ఎత్తును రికార్డు చేస్తారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

నిత్యం ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని పెద్దఎత్తున స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణమాసం, కార్తీక మాసం వంటి ప్రత్యేకమైన మాసాలలో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని స్వామివారి పై గ్లాసు నీటిని పోసి అభిషేకం చేస్తారు.

shiva lingaఇలా చేయడం వల్ల వారికి ఉన్న సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారని భక్తులు భావిస్తారు.

మరికొంత మంది భక్తులు కాలినడకన కూడా ఈ ప్రాంతానికి చేరుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా స్వామి వారికి ఒక గ్లాసు నీటిని పోయటం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా తొందరగా పరిష్కారం అవుతుందని అక్కడి భక్తుల విశ్వాసం. ఇక మహాశివరాత్రి, కార్తీకమాసం వంటి పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,470,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR