భారతదేశం దేవాలయాలకు ప్రసిది. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించడానికి దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. అయితే కొన్ని దేవాలయాలు ఎలా వెలిసాయి, అక్కడి శిల్ప కళ నైపుణ్యం ఇప్పటికి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇది ఇలా ఉంటె దేవుడు నమ్మకం నుండి కొన్ని ఆచారాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ 9 ఆలయాలలో అందరికి ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని విచిత్ర ఆచారాలు ఉన్నాయట. మరి ఆ వింత ఆచారాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. మహేంద్రపూర్ బాలాజీ ఆలయం:రాజస్థాన్ లోని చిన్న దౌసా జిల్లాలో మహేంద్రపూర్ బాలాజీ ఆలయం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ప్రతి రోజు వారికీ పట్టిన దయ్యాలను, ఆత్మలను వదిలించుకోవడానికి ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే ఈ ఆలయంలో పట్టిన దయ్యాన్ని వదిలించడానికి వారి ఒంటి మీద బాగా మరిగించిన వేడి నీటిని పోసి, గాలిలో ఉరేసిన విధంగా వ్రేలాడదీస్తూ హిమిసించి వారి తలని గోడకి వేసి బాగా కొడుతారంటా. ఆత్మలను ప్రాలదోలే ఈ ఆలయంలో ప్రసాదం లాంటివి ఏం ఉండవు. ఇంకా ఆత్మని వదిలించుకొని వెళ్లే భక్తులు మళ్ళీ వెనుకకి తిరిగి ఈ ఆలయాన్ని చూడకుండా వెళ్లిపోవాలని నియమం కూడా ఉంది. భారతదేశంలోనే దయ్యాలను ప్రాలదోలే ఏకైక ఆలయంగా ఈ ఆలయం ఇప్పటికి ప్రచారంలో ఉంది.
2. కామాఖ్యా దేవి ఆలయం, అస్సాం: అస్సాం లోని గౌహతి ప్రాంతంలోని నిలచెల్ కొండా ప్రాంతంలో కామాఖ్యా దేవి ఆలయం ఉంది. భారత దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయంలో శిల్పం అనేది ఉండదు. అయితే సతీదేవి యొక్క శరీర భాగాలు పడి దేశంలో వివిధ ప్రాంతాలలో శక్తి పీఠాలు వెలిసాయి. సతీదేవి శరీర భాగం పడిన ఈ ప్రాంతం కూడా ఒక శక్తి పీఠంగా చెబుతారు. అలా ఈ ఆలయంలో ఎరుపు పట్టు చీరతో కప్పబడిన శివుని భార్య దేవి సతి యొక్క యోని పూజలందుకుంటుంది. ప్రతి సంవత్సరం రుతుపవన సమయంలో అమ్మవారి ఋతుస్రావం సమయంలో మూడు రోజులు ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఆ మూడు రోజులు కూడా భక్తులు తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబాచి మేళా అని ఇక్కడ జరుపుకుంటారు. ఈ ఆలయ గర్భగుడిలో ప్రవహిస్తున్న భూగర్భ వసంత ఈ మూడు రోజుల్లో కూడా ఎరుపు రంగులోకి మారుతుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా భక్తులు ఎరుపు వస్త్రంను అందిస్తారు.
3. కాల భైరవ ఆలయం, వారణాసి:శివాలయానికి క్షేత్రపాలకుడైన కాల భైరవ ఆలయంలో ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడి కాలభైరవ విగ్రహం నోటిలో మద్యాన్ని పోస్తారు. అంతేకాకుండ భక్తులకు కూడా ప్రసాదంగా మద్యాన్ని ఇస్తుంటారు. ఆలయం బయట కూడా పూజ సామాగ్రి, వేరే రకమైన దుకాణాలు ఏమి ఉండవు దేవుడికి నైవేద్యంగా పొసే మందు దుకాణాలు ఉంటాయి.
4. దేవరగట్టు ఆలయం, ఆంద్రప్రదేశ్:ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దేవరగట్టు ఆలయం ఉంది. ఇది ఒక ప్రాచీన ఆలయంగా చెబుతారు. దసరా పండుగ రోజు కర్ణాటక సరిహద్దులలో ఇక్కడ రాత్రి వరకు ఒకరి తలల పైన ఒకరు కర్రలతో దాడిచేసుకుంటూ విపరీతంగా కొట్టుకుంటారు. ఇలా దాడి చేసుకున్న తరువాత ఆ గాయాలు, రక్తంతో పురుషులు రాత్రి సమయం వేడుకలో పాల్గొనడం ఇక్కడి ఆచారం.
5. స్తంభేశ్వర్ మహాదేవ టెంపుల్, గుజరాత్:గుజరాత్ లోని వదోదరాకు సమీపంలో ఉన్న ఈ స్తంభేశ్వర్ మహాదేవ టెంపుల్ అరేబియా సముద్రంతో తీరం సమీపంలో ఉంది. ఈ ఆలయం రోజులో కిన్ని సార్లు కనిపిస్తూ అదృశ్యమవడం ఈ ఆలయం ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆలయం ఎప్పుడూ సముద్రం లోపలే ఉంటుంది. అలల పోటు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఆ సమయంలోనే వారు స్వామిని దర్శించుకుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.