బియ్యం కడిగిన నీటితో కలిగే ఉపయోగాలు ఏంటి ?

వంట గదిలో ఉండే ఎన్నో ఔషధాలు మన అందాన్ని, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటాయి. మనం చేయవలసినదల్లా దేని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి వాటిని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోవడమే. అందులో ఒక మంచి రెమెడీ గురించి బియ్యం నీళ్లు. అన్నం వండడానికి ముందు ఒకటికి రెండు సార్లు బియ్యాన్ని కడుగుతాం. తర్వాత ఆ నీటిని పారబోస్తాం. కానీ ఈ నీళ్లలో అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఆ పారబోసే నీటితో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Beauty tips with rice waterబియ్యం శుభ్రంగా కడిగి కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి. తర్వాత బియ్యం బాగా కడిగి వడగట్టాలి. ఇలా సేకరించిన బియ్యం నీటిని…వెంట్రుకలకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉంటుంది, కుదుళ్లు కూడా బాగా బలపడతాయి.

తల స్నానం చేసే ముందు బియ్యం నీళ్లను తడుపుకుని మస్సాజ్ చేసి ఏదైనా హెర్బల్ షాంపూతో తలంటుకుంటే జుట్టు మెరిసిపోతుందట.

Beauty tips with rice waterజుట్టు చివర్లు చిట్లుతుంటే ఆ చివర్లను బియ్యం నీళ్లతో తడుపుతూ తలస్నానం చేస్తే జుట్టు ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయి. ఇవి మంచి కండీషనర్ గా ఉపయోగపడతాయి.

ఈ బియ్యం నీటితో రోజూ ముఖం కడుక్కుంటే చర్మం నిగారింపు రావటమే కాకుండా చర్మం పైన మడతలు, మచ్చలు, మొటిమలు పోతాయి. మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా మారుతుంది.

Beauty tips with rice waterచర్మం మీద దద్దుర్లు, మంటలు లాంటి చర్మ సమస్యలు ఉన్న క్రమంగా తగ్గుతాయి. ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది.

బియ్యం నీటిలోని పోషకాల వల్ల చర్మం జీవం సంతరించుకుంటుంది. తెరుచుకొని ఉన్న చర్మ రంధ్రాలు మూసుకుని, చర్మం బిగుతుగా మారుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR