Bharathadeesham goppathananni thelipe konni ascharyakara vishayalu

0
7467

భారతదేశం ఏ ఒక్క మతానికి చెందినది కాదు. అన్ని మతాల వారిని హక్కును చేర్చుకునే ఒక గొప్ప మనసు మన దేశానికే ఉంది. ప్రపంచంలో లేని ఎన్నో వింతలు విశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఆధ్యాత్మికత, సంస్కృతి, సైన్స్, పర్యాటక రంగం ఇలా ఏ విషయంలో అయినా మన దేశానికి మంచి గుర్తింపు అనేది ఉంది. అయితే ఎవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకర నిజాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ ఆశ్చర్యకర విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.1 India Goppatanamడైమండ్:2 India Goppatanamమొట్టమొదటిసారిగా డైమండ్ ని మన దేశంలోనే గుర్తించారు. అదికూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, క్రిష్ణా జిల్లాల మధ్య ఉన్న క్రిష్ణా నదిలో డైమండ్ అనేది మొదటిసారిగా కనుగొనబడింది.
చెస్: Bharathadeeshamచెస్ అనే గేమ్ మొదటగా మన దేశంలోనే పుట్టింది. మెదడుకి పని చెప్పే ఈ చెస్ ని చతురంగ అని అంటారు. ఈ పదం సంస్కృతం నుండి వచ్చింది. చతురంగ అంటే నలుగురిని అర్ధం. ఆ నాలుగు ఏంటంటే యుద్ధంలో ఉండే ఏనుగు, సిపాయి, రథం, గుర్రం అని అర్ధం. ప్రస్తుతం చెస్ ఆంతర్జాతీయ గుర్తింపు పొందింది.
హిందూ క్యాలెండర్:Bharathadeeshamహిందూ క్యాలెండర్ లో ఆరు రుతువులు, భారతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం ఆరుకాలాలున్నాయి. అవి గ్రీష్మ, హేమంత, శిశిర రుతువు, శరత్ రుతువు, వసంత రుతువు, వర్ష రుతువు.
ఆర్మీ:Bharathadeeshamమూడవ అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశంగా మన దేశాన్ని చెబుతారు. మొదటి రెండు స్థానాలలో అమెరికా, చైనా ఉన్నాయి.
అస్థిపంజరం:6 India Goppatanamఇండియా మరియు చైనా సరిహద్దులలో ఉన్న ఒక చెరువు ఎండిపోవడం మూలాన అందులో అస్థిపంజరాలు లభించాయి. ఇవి దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం వి అని పరిశోధనలో తేలింది.
కుంభమేళా:7 India Goppatanamమన దేశంలో జరిగే అతిపెద్ద వేడుక కుంభమేళా. అయితే 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పండుగిది. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కలిసేది కుంభమేళా సమయంలోనే అని తేల్చారు. భారతదేశంలో తప్ప మరెక్కడా కూడా ఇంతమంది మనుషులు ఒకేసారి కలవరు. అయితే ఈ పండుగ సమయంలో బిలియన్ సంఖ్యలో మనుషులు పాల్గొంటారు.
పాల ఉత్పత్తి: 8 India Goppatanamమన దేశం వ్యవసాయ రంగానికి ప్రత్యేకం. అదేవిధంగా పాల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉందని చెబుతారు.
పోస్టల్ సర్వీస్:9 India Goppatanamభారతదేశంలో అతిపెద్ద పోస్టల్ సర్వీస్ ఉంది. చిన్న చిన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద సిటీలు, టౌన్లకు కూడా పోస్టల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాశ్మీర్ లో కూడా పోస్టాఫీస్ ప్రారంభించారు.
పోలో క్లబ్:10 India Goppatanamప్రపంచం మొత్తంలో అతిపురాతన పోలో క్లబ్ మన దేశంలోని కోలకతా లో ఉంది.
శాకాహారం: 11 India Goppatanamప్రపంచం లోని అన్ని దేశాలతో పోలిస్తే మన దేశం మాంసాహారానికి ఎక్కువగా దూరంగా ఉంటున్నారు. దాదాపుగా మన దేశంలో 30 శాతం వరకు శాకాహారులు ఉంటారు.
ఇంగ్లీష్:12 India Goppatanamఅగ్రరాజ్యం అయినా అమెరికా తరువాత ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేది మన దేశమే అని తేలింది.