దేశం మొత్తంలో ఎక్కువగా సందర్శించే గుహలు ఏవి ఐన ఉన్నాయంటే అవి బోర్రా గుహలు అని చెబుతారు. ప్రకృతిలో సహజంగా ఏర్పడిన ఈ గుహలు ఎంతో ప్రాచీనమైనవిగా చెబుతారు. అయితే ఒరియా భాషలో బోర్రా అంటే రంద్రం అని అర్ధం ఆ కారణంగానే ఈ గుహాలకి బోర్రా గుహలు అనే పేరు వచ్చింది. మరి ఈ గుహలు ఎక్కడ ఉన్నాయి? వాటి యొక్క ప్రాముఖ్యత మరియు అసలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అక్కడ ఏం ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.విశాఖపట్టణం లోని అనంతగిరి మండలం తూర్పు కనుమల్లో ఈ బోర్రా గుహలు ఉన్నాయి. ప్రకృతి అరకు లోయల్లో అందించిన ఒక అధ్బుతం ఈ బోర్రా గుహలు. అయితే మొదటగా బొర్రా గుహలను 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు అనేవి ఏర్పడ్డాయి. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగులు వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయని చెబుతారు. ఇవి కాలక్రమంలో వింత వింత ఆకృతులను సంతరించుకున్నాయి. ఈ గుహల్లో తవ్వకాలు జరిపినప్పుడు 50 వేల ఏళ్లక్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను బోడో దేవుడి నివాసంగా విశ్వసిస్తారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్‌మైట్‌లను శివ-పార్వతి, తల్లి-బిడ్డ, ఋషి గడ్డం, మానవ మెదడు, మొసలి, పులి, ఆవు వంటి పేర్లతో పిలుస్తూ పూజిస్తూంటారు. బొర్రా గుహలను స్థానికంగా నివసించే ప్రజలు దేవుని నివాసం గా పేర్కొంటారు. ఎందుకంటే గుహలో కొన్ని ఆకారాలు దేవుని రూపాన్ని కలిగి ఉంటాయి. అందుకే భక్తులు వీటిని భక్తి తో సందర్శించి పూజలు చేస్తుంటారు. ఈ గుహలకు గోస్తాని నది తొలిచిన నాలుగు ద్వారాలు ఉన్నాయి. బొర్రా-1 అని వ్యవరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడి నుంచి లోపలికి ఒక కిలోమీటరు వరకూ వెళ్లి గోస్తాని నదిని చేరవచ్చు. ఈవిధంగా ప్రకృతిలో ఏర్పడ్డ ఈ గుహాలని సందర్శించాడనికి ప్రతి సంవంత్సరం కొన్ని లక్షల మంది ఇక్కడకి వచ్చి ఒక గొప్ప అనుభూతిని పొందుతుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.