Home Health దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా ?

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా ?

0

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. వీళ్ళు తీసుకోవచ్చు, వాళ్లు తీసుకోకూడదు, ఈ వ్యాక్సిన్ మంచిది, ఆ వ్యాక్సిన్ పనిచేయదు అని, వ్యాక్సిన్ వేసుకుంటే కొవిడ్ రావచ్చనే ఎన్నో పుకార్లు, ఎన్నో సందేహాలు, భయాలు కూడా వ్యాక్సిన్కి ప్రజలు దూరంగా ఉండేలా చేస్తున్నాయి.

కొవిడ్ వ్యాక్సిన్కానీ అలాంటి భయాలేమీ అవసరం లేదు. బీపీ, షుగర్, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్, హెచ్ఐవీ, అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కూడా వేయించుకోవచ్చు. సాధారణ వ్యక్తుల కన్నా ఇలాంటి వాళ్లకే వ్యాక్సిన్ ఎక్కువ అవసరం. వీళ్లే అందరికన్నా ముందు తీసుకోవాలి. అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

షుగర్ పేషెంట్లు, బీపీ, థైరాయిడ్ కి మందులు వాడేవారు ఆ మందులు ఆపాల్సిన అవసరం కూడా లేదు. వ్యాక్సిన్ తీసుకుని, మెడిసిన్స్ని కంటిన్యూగా వాడొచ్చు. డాక్టర్ సలహా కూడా అవసరం లేదు. కొంతమంది రక్త సమస్యలతో మందులు వాడుతూ ఉంటారు. రక్తం పలుచబడే మందులు వాడుతున్న వాళ్లు కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసు కోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఆ మందులు రెగ్యులర్గా వాడొచ్చు.

ఇక గర్భవతులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోకూడదు. వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్19 బారిన పడే ప్రమాదం ఉంటుందని వాట్సాప్, ఫేస్బుక్ పోస్టులు చదివి కొందరు నమ్ముతున్నారు. అలాగే పీరియడ్స్‌‌లో ఉన్న అమ్మాయిలు టీకా తీసుకోవద్దని, ఇమ్యూనిటీ పోతుందని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ డౌట్ వల్లే చాలామంది వ్యాక్సినేషన్కి దూరంగా ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ రాదు.

పీరియడ్ వచ్చే ముందు రోజు, పీరియడ్‌‌లో ఉన్నప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రికాషన్స్ ఏమీ అవసరం లేదు. ఎవరికి ప్రాబ్లమ్ రాలేదు. ఏదైనా సమస్య ఉండి మందులు వాడేవాళ్ళు కూడా నిర్భయంగా తీసుకోవచ్చు. వ్యాక్సిన్ ఎవరు తీసుకున్నా జ్వరం, తలనొప్పి లాంటి సాధారణ సమస్యలే ఉంటాయి. కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావు. కొవిడ్ ప్రమాదం ముందు ఈ సమస్యలు చిన్నవి. కాబట్టి భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి.

అయితే ప్రభుత్వం చెప్పిన రూల్స్ మాత్రం పాటించాలి. 18 ఏళ్లు అంతకు మించిన వయసు వారు మాత్రమే తొలిదశలో టీకా వేయించుకోవాలి. మొదటిసారి ఏ వ్యాక్సిన్ వేసుకుంటే, రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలి. రెండు వ్యాక్సిన్ల మధ్య నిర్ణిత గడువు ఉండాలి. అలర్జీ… అనఫైలాటిక్ రియాక్షన్లు ఉన్నవారు కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఇంజక్షన్లతో అలర్జీ వచ్చేవారు కూడా వ్యాక్సిన్‌కి దూరంగా ఉండాలి. ప్లాస్మా థెరపీ తీసుకున్నవారికి కనీసం 4 నుంచి 8 వారాల గ్యాప్ తర్వాతే టీకా ఇవ్వాలి.

ఇమ్యునోసప్రెసెంట్స్‌, స్టెరాయిడ్స్‌, హెచ్‌ఐవీకి మందులు వాడుతున్నవారు వ్యాక్సిన్‌ వేయించుకోకూడదు. స్టెరాయిడ్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో నోటి ద్వారా, ఇంజెక్షన్‌ల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్‌ వాడుతున్నవారు టీకాకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ వేయించుకున్నా ఉపయోగం ఉండదు. వారిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి కావు.

సార్స్ సీవోవీ2 ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉన్నవారికి కోలుకున్నాక, 4 నుంచి 8 వారాల తర్వాత తర్వాత టీకా ఇవ్వాలి. రక్తం గడ్డకట్టకుండా ఉండే సమస్య కొందరికి ఉంటుంది. అలాంటి వారు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. కరోనా సోకి యాంటీబాడీస్ పొందిన వారు ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోకూడదు. కనీసం 4 నుంచి 8 వారాల తర్వాతే వేయించుకోవాలి. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత రుద్దడం, వేడినీళ్లు, ఐస్‌ పెట్టి కాపడం లాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. దాన్ని అలా వదిలేయాలి. జ్వరం, తలనొప్పి, నీరసం, ఇంజెక్షన్‌ వేసిన చోట కొద్దిగా నొప్పి ఉంటాయి. బాగా నొప్పి అనిపిస్తే డోలో లేదా పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుంది. టీకాకు ముందు, తర్వాత కనీసం రెండు, మూడు రోజులు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కొవిడ్ బారినపడితే వ్యాక్సిన్ పనిచేయనట్లు కాదు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత ఇమ్యూనిటీ వస్తుంది. ఈ లోగా కరోనా బారినపడొచ్చు. కాబట్టి వ్యాక్సిన్ పనిచేయట్లేదని అనుకోవద్దు. వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ రాదని నూటికి నూరు పాళ్లు హామీ ఇవ్వలేము. కానీ, కొవిడ్ బారినపడి హాస్పిటల్లో చేరిన పేషెంట్స్లో వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. వ్యాక్సిన్ కరోనా బారిన పడకుండా కాపాడుతుంది.

Exit mobile version