వేడి నీటిని తాగండి ఆరోగ్యాన్ని ,అందాన్ని కాపాడుకోండి

0
3432

ఎక్కువ శాతం మంది చల్లగా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగేందుకే ఇష్టపడతారు. అయితే, దాని వల్ల ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ. చల్లని నీరు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే వైద్యులు గది ఉష్ణోగ్రతతో సమానమైన నీళ్లు (నార్మల్ వాటర్) తాగడం మంచిదని చెబుతారు. రోజూ ఎంత నీరుతో అంత ఆరోగ్యమని సూచిస్తున్నారు. మహిళలు రోజుకు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున తాగడం మంచిదని చెబుతున్నారు.నీరు తాగమన్నారు కదా అని చల్లని నీటిని తాగేందుకు మాత్రం ప్రయత్నించొద్దు. వీలైతే గోరు వెచ్చని నీటిని తాగండి. ముఖ్యంగా ఉదయం వేళల్లో.. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ గోరువెచ్చని వేడి నీటితో శరీరానికి ఇంత లాభం ఉందని తెలిస్తే తాగకుండా ఉండలేరు.

గొంతు-శ్వాసనాళ సమస్యలు:

Consequences of drinking hot waterదగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం ఒక గొప్ప నేచురల్ హోం రెమడీ. ఇది నిరంతరం వేధించే పొడి దగ్గును తగ్గించి, శ్వాసనాళాన్ని తేలికచేసి, శ్వాస సరిగా పీల్చుకొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునిప్పిని నివారిస్తుంది.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

Consequences of drinking hot waterహాట్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంను డిటాక్సిఫై చేస్తుంది మీరు అజీర్తి సమస్యలను తగ్గించుకోవాలన్నా లేదా శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేయాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఉదయం మరియు రాత్రి పడుకొనే ముందు వేడి నీళ్ళు త్రాగడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేడి నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో వేడి పుట్టి, చెమట పట్టడం ప్రారంభం అవుతుంది దాంతో శరీరంలోని టాక్సిన్స్ ను చెమట రూపంలో బయటకు నెట్టివేస్తుంది. మరింత మంచి ఫలితాల కోసం నిమ్మరసం మరియు తేనెను మిక్స్ చేసుకోవచ్చు.

మొటిమలు మచ్చలు తొలగిస్తుంది:

Consequences of drinking hot waterరెగ్యురల్ గా క్రమంతప్పకుండా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని తేమగా మరియు వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇది డ్రై మరియు ఫ్లెక్సీ స్కిన్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది. మరియు ఆరోగ్యకరమైన చర్మానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరం మొత్తంలో బ్లడ్ సర్కులేషన్ పెంచి శరీరానికి మంచి చర్మఛాయను అంధిస్తుంది. అంతే కాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. హాట్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోపలి నుండి శుభ్రం చేస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

Consequences of drinking hot waterహాట్ వాటర్ తీసుకోవడం వల్ల మీ హెయిర్ సెల్స్ కు శక్తినందివ్వడానికి సహాయపడుతుంది. ఇది వాటి నిరంతర క్రియలను పెంపొందిస్తుంది. దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది:

Consequences of drinking hot waterహాట్ వాటర్ వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఇది బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుంది. ముఖ్యంగా బాడీఫ్యాట్ ను కరిగిస్తుంది. అదే సమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది:

Consequences of drinking hot waterవేడి నీళ్ళను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా క్రోనిక్ సమస్యలతో పోరాడి, మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. తిన్న ఆహారం ప్రేగుల్లో స్మూత్ గా ముందుకు జరిగి జీర్ణం అవ్వడానికి హాట్ వాటర్ లేదా గోరువెచ్చని నీళ్ళు అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే, గోరువెచ్చని నీటిని కాలీ కడుపున తీసుకోవాలి.

బరువు తగ్గించుకోవడానికి :

Consequences of drinking hot waterమీరు అదనపు బరువును కొన్ని పౌండ్లలో తగ్గించుకోవాలనుకుంటే, హాట్ వాటర్ అందుకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది మీ జీవక్రియలను మెరుగుపరుస్తుంది మరియు చర్మం క్రింది భాగంలో ఉన్న కొవ్వుకణాలను విచ్చిన్నం చేయడానికి సహాయపడుతుంది. మరింత ఎఫెక్టివ్ గా ఫలితం పొందాలంటే, హాట్ వాటర్ లో నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. క్రమం తప్పకుండా తీసుకుంటే బాడీ వెయిట్ తగ్గించుకోవడంలో తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

చిన్న వయస్సులో వృద్ధాప్యం యొక్క లక్షణాలను నివారిస్తుంది:

Consequences of drinking hot waterప్రతి రోజూ రెగ్యులర్ గా వేడీనీళ్ళు త్రాగడం వల్ల అకాల వృద్ధాప్యంను నివారించి యవ్వనంగా మరియు మెరిసేటి చర్మకాంతిని పొందవచ్చు. ఇది శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు నెట్టడం వల్ల చర్మకణాలను రిపేర్ చేస్తుంది. అది హానికరమైన ఫ్రీరాడిక్స్ మీద ఎఫెక్టివిగ్ గా పనిచేస్తుంది. హాట్ వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది.

రుతుస్రావంలో క్రాంప్స్ ను నివారిస్తుంది:

Consequences of drinking hot waterహాట్ వాటర్ మెనుష్ట్రువల్ క్రాంప్స్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వేడినీటిని తీసుకోవడం వల్ల పీరియడ్స్ లో పొట్టలో తిమ్మర్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆ సమయంలో వేడీ నీళ్ళు తీసుకోవడం ద్వారా పొట్ట ఉదర భాగంలోని కండరాలు మరింత తేలిక పరిచి క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.