Devudiki Naivedyanga A phalam tho elanti phalitham?

0
3220

మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ, అరటిపండు వంటివి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాము. అయితే దేవుడికి ఎలాంటి నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరికాయ:fruitsభగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ త్వరగా సులభంగా విజయవంతం అవుతాయి.

అరటిపండు:fruitsదేవుడికి అరటిపండుని నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది. అరటిపళ్ళను గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పించినట్లైతే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపండ్లని నైవేద్యంగా పెడితే మధ్యలోనే నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి.

నేరేడు పండు:fruitsశనీశ్వరునికి నేరేడుపండుని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుమునొప్పి, మోకాళ్ళ నొప్పులు వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు.

ద్రాక్షపండు:fruitsదేవుడికి నివేదించిన ద్రాక్షపండ్లని ముందు చిన్న పిల్లలకు తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు. ఇంకా రోగాలు నశిస్తాయి, కార్యజయం లభిస్తుంది.

మామిడిపండు:fruitsదేవుడికి మామిడిపండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుండి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యముగా పెట్టిన మామిడి పండుని దేవుడికి అభిషేకము చేసిన తేనెలో కలిపి నైవేద్యముగా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లైతే మోసము చేసినవారు స్వయంగా మీ నగదు మీకు తిరిగి ఇస్తారు.

సపోటపండు:7 falala naivedyam vaati falithaluదేవుడికి నైవేద్యం పెట్టిన సపోటా పండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి అనారోగ్య బాధలన్నీ తొలగి ఆరోగ్యవంతులవుతారు. ఇంకా పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలన్నీ తొలగిపోతాయి.

యాపిల్ పండు:8 falala naivedyam vaati falithalu
దేవుడికి యాపిల్ పండుని నైవేద్యముగా పెడితే దారిద్య్రం తొలగి ధనవంతులవుతారు.

కమలాపండు:9 falala naivedyam vaati falithaluదేవుడికి నైవేద్యంగా కమలాపండు ని నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయి.

పనసపండు:10 falala naivedyam vaati falithaluపనసపండుని దేవుడికి నైవేద్యముగా పెడితే శత్రు నాశనము, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు.