ఏ దేవునికి ఏ నైవేద్యం పెడితే ప్రీతికరమో తెలుసా ?

ఏదైనా పండగ వస్తే దేవుడికి నైవేధ్యంగా ఏమి సమర్పించాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఏ దేవునికి ఏ నైవేద్యం పెడితే ప్రీతీ చెందుతారో తెలుసుకుందాం..

శ్రీ వేంకటేశ్వరస్వామికి :

వేంకటేశ్వరస్వామివడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో వేయాలి.

వినాయకునికి :

vinayakaబెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం మరియు శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.

ఆంజనేయస్వామికి :

ఆంజనేయస్వామిఅప్పులు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.

సూర్యునికి :

sunమొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.

లక్ష్మీదేవికి :

లక్ష్మీదేవిక్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజలు చేయాలి.

లలితాదేవికి :

లలితాదేవిక్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.

సత్యన్నారాయణస్వామికి :

సత్యన్నారాయణస్వామిఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.

దుర్గాదేవికి :

దుర్గాదేవిమినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.

సంతోషీమాతకు :

సంతోషీమాతపులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.

శ్రీ షిర్డీ సాయిబాబాకు

షిర్డీ సాయిపాలు, గోధుమరొట్టెలు నైవేద్యం.

శ్రీకృష్ణునికి :

sri krishnaఅటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళాలతో పూజలు.

శివునికి :

lord shivaకొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా మరియు మారేడు దళాలు , నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR