Home Health మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా ?

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా ?

0

మన పూర్వం అమ్మమ్మల కాలంలో 100 ఏళ్ళు మనుషులు ఆరోగ్యాంగా బ్రతికారని వినేవాళ్ళం. ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది కష్టమే. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నాం. అందుకు చాల కారణాలు ఉన్నాయి.మారిన జీవన శైలి,ఆహారపు అలవాట్లు మారిపోవటం,కాలుష్యం పెరిగిపోవటం.పని ఒత్తిడి పెరగటం, సమయానికి ఆహారం తీసుకోకపోవటం.బయట జంక్ ఫుడ్ కి అలవాటు పడటం.

ఇటువంటి కారణాల వల్ల చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడటం 40 ఏళ్లకే ముసలి వాళ్ళవటం ఒళ్ళు నొప్పులతో పనులు చేసుకోలేక పోవటం లాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొంచం సమయం కేటాయించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటో ఎప్పుడు చూద్దాం

1. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చటి మంచి నీటిని సేవించండి.

Hot Water2. ప్రతి రోజు యోగ లేదా వ్యాయామం చేయడానికి కనీసం ఇరవై నిమిషాల సమయం కేటాయించాలి

3. ఆహారాన్ని తొందర తొందరగా మింగేయకుండా చక్కగా నమిలి తినండి

4. ఎప్పుడు ఒకే విధమైన ఆహారం కాకుండా ఆహారంలో మార్పులు చేస్తూ ఉండాలి.

5. టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి.

6. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి.

7. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి-మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి.

8. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి.

9. భోజనంలో సలాడ్, రుతువులననుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి.

10. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు వుండేలా చూసుకోండి.

11. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి.

12. ఉదయం-రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్లు తోముకోవాలి.

13. సమయానుసారం భోజనం చేయాలి, రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి.

14. రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటిన రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమౌతాయి.

15. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లౌతుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తకపఠనం చేస్తే చాలా మంచిది.


16. అవసరం లేకపోయినా సెల్ ఫోన్లు ఎక్కువ సేపు వాడటం మంచిది కాదు

17. రోజుకు ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నవ్వండి నవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి చాల మంచిది.

Exit mobile version