కరోనా వేళ తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసా ?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదకారిగా మారింది. అది ఎటు నుంచీ మనపై దాడి చేస్తుందో తెలియదు. ఐతే దాడి చేసినా ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మనం మంచి ఆహారం తినాలి. పుష్టిగా, ఆరోగ్యవంతంగా ఉండాలి. పొరపాటున కరోనా వైరస్ బారిన పడితే అప్పుడు మనం భయపడకుండా ముందు నుంచే పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే బాడీలోకి వెళ్లిన వైరస్‌ మనల్ని ఏమీ చెయ్యలేక చేతులెత్తేస్తుంది. అలా జరగాలంటే మనం మంచి ఆహారం తినాలి. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుకోవాలి. మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ ముందు వైరస్ పవర్ తేలిపోవాలి.

foods to take during coronaఅదే విషయాన్ని సైంటిస్టులు గుర్తించారు. జర్మనీకి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మాలిక్యులార్‌‌ వైరాలజీ, యూఐఎమ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌‌ సైంటిస్టుల స్టడీ ప్రకారం గ్రీన్‌ టీ, దానిమ్మ, క్రాన్‌బెర్రీ, చోక్‌బెర్రీ.. కరోనా వైరస్‌ను సమర్థంగా అడ్డుకుంటాయని వెల్లడించారు. దీనికిగల కారణాలను కూడా వారు వివరించారు.

foods to take during coronaరకరకాల గ్రీన్‌ టీలు అందుబాటులో ఉన్నాయి వాటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు వైరస్‌పై పోరాడుతున్నాయి. ఫ్లూను అరికట్టే లక్షణాలు కూడా గ్రీన్‌ టీలో ఉంటాయి.

foods to take during coronaచోక్‌బెర్రీస్‌ కూడా కోవిడ్‌ను అరికట్టడంలో మిగతా వాటికంటే బెటర్‌‌గా పనిచేస్తాయి అంటున్నారు సైంటిస్ట్ లు.

foods to take during coronaఅలాగే, దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ డైరెక్ట్గా కరోనా వైరస్‌పై పోరాడకున్నా ఓవరాల్‌ హెల్త్‌ విషయంలో బాగా పనిచేస్తాయి. క్రాన్‌బెర్రీలో ఉండే విటమిన్-సి ఇమ్యూనిటీని పెంచుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR