ఈతి బాధలు పోవాలంటే ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి?

మనలో చాలామంది ఈతిబాధలతో స‌త‌మ‌త‌మవుతుంటారు.. వీటికి నివారణగా ఏం చేయాలి? ఏ దేవున్ని ప్రార్థించాలి? ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి ప‌రిహారం చేసుకోవాల‌ని సందేహపడ్తుంటారు చాలా మంది. అయితే పండితులు ఈ ఈతిబాధలకోసం కొన్ని పరిహారాలు సూచించారు.. అవి అందరికి తెలియకపోవచ్చు.. దీనికోసం ద్వాదశ రాసులవారు వారి రాశి లగ్నం ప్రకారం పూజ చేసి తములం సమర్పించాల్సి ఉంటుంది… మరి ఈతిబాధలు నుండి బయటపడేందుకు అయితే 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకుందాం..

మేష రాశి : ఈ రాశి వారు తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారం రోజున కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొల‌గిపోతాయి.

Subramanya Swamyవృషభ రాశి :ఈ రాశి వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి.

Vrushaba Rasiమిథున రాశి: ఈ రాశివారు తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

Ganeshaకర్కాటక రాశి :ఈ రాశి వారు.. తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.

Kali Mathaసింహ రాశి: ఈ రాశివారు.. తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.

Sai Babaకన్యారాశి రాశి: ఈ రాశివారు.. తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది.

Lakshmi Deviతులా రాశి : ఈ రాశి వారు.. తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

Lakshmi Deviవృశ్చిక రాశి : ఈ రాశి వారు.. తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

Hanumanధనుస్సు రాశి: ఈ రాశి వారు.. తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

Vekannaమకర రాశి :ఈ రాశి వారు.. తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి.

Kali Mathaకుంభ రాశి: ఈ రాశి వారు.. తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.

Kali Devethaమీన రాశి : ఈ రాశి వారు.. తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతారు.

Devi

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR