శివుడిని బుగ్గసంగమేశ్వరస్వామి అని పిలుస్తారు ఎందుకు ?

మహాశివుడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడిని బుగ్గసంగమేశ్వరస్వామి అని పిలుస్తారు. మరి శివుడు ఇక్కడ ఎలా వెలిసాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shivaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, గుంతకల్ మండలానికి కొన్ని కోలోమీటర్ల దూరంలో శ్రీ బుగ్గ సంగమేశ్వరాలయం ఉంది. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణకాశి అని పిలుస్తారు. ఈ స్వామి ఇక్కడ స్వయంభువు గా వెలిశాడని పురాణం.

Bugga Sangaeswara Alayamఇక పురాణానికి వస్తే, పూర్వం ఒక బ్రాహ్మణుడు విసుగు చెంది ఎక్కడ శాంతి దొరుకుందా అని బయలుదేరగా ఎక్కడ ఆయనికి శాంతి లభించలేదు. దీంతో వెళ్లి అయన గురువుని అడుగగా, అప్పుడు ఆ మహర్హి నేను ఒక కర్రని కాశీలోని గంగ నదిలో వదిలేస్తాను, నేను వదిలిన ఆ కర్ర నీవు పర్యటనలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే కనిపిస్తుందో అక్కడ నీకు తప్పకుండ శాంతి లభిస్తుందని చెప్పాడు. ఇలా గురువు చెప్పగానే బయలుదేరిన అతడికి ఈ గ్రామం చేరుకునపుడు నదిలో ఆ కర్ర కనిపించగా గురువు చెప్పిన ప్రదేశం ఇదేనని సంతోషించి ఇక్కడ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని పురాణం.

Bugga Sangameswara Alayamఇక్కడ విశేషం ఏంటంటే, రెండు నీటి బుగ్గలు నిరంతం కూడా కాశీలో మాదిరిగానే ఉత్తరం నుండి దక్షిణం వైపుకి ప్రవహిస్తాయి. అందుకే ఈ ఆలయానికి శ్రీ బుగ్గ సంగమేశ్వరస్వామి అనే పేరు వచ్చినదని చెబుతారు. ఇక్కడ వందలాది మొగలి పొదలు ఉన్నవి. అయితే ఈ ఆలయానికి ఎదురుగానే ఒక ఎత్తైన కొండపైన నందీశ్వరునికి ఒక ప్రత్యేక ఆలయం అనేది ఉంది. మహానంది లో మాదిరిగానే ఇక్కడి కోనేరులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR