మహా కాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో భూతనాథుణ్ణి ఎలా అభిషేకిస్తారో తెలుసా?

0
1774

మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలిలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రాలలో ప్రత్యక్షంగా ఆ పరమ శివుడు కొలువై ఉంటాడని భక్తుల నమ్మకం. అందుకే జ్యోతిర్లింగ క్షేత్రాలను ఎంతో శక్తివంతమైనది గాను, మహిమాన్వితమైనది గా చెపుతారు. అందులో ఒకటే మద్య ప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో గల మహా కాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం.

Maha Kaleshwar Jyotirlinga Templeఉజ్జయిని లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న మహా కాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా ఉన్న పరమ శివుడు ఉగ్ర స్వరూపుడిగా కనిపిస్తాడు. అయితే ఇక్కడ గల శివునికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్వామికి స్మశానం లోని బూడిదతో అభిషేకం చేస్తారు. లోక కంటకుడు అయిన దూషణా సురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత స్వామి ఇక్కడ స్వయంభువు గా వెలిసినట్లు స్థానిక కథనం. ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల మృత్యు భయం తొలిగిపోతుందని భక్తుల నమ్మకం.

Maha Kaleshwar Jyotirlinga Templeఇక్కడ స్వామి మహా కాళేస్వరుడు, ఓంకారేశ్వరుడు, నాగ చంద్రే శ్వరుడు గా మూడు అంతస్తుల్లో కొలువై ఉన్నాడు. దక్షిణ ముఖంగా ఉన్న స్వామిని తాంత్రిక స్వరూపుడిగా చెపుతారు. నాగ చంద్రేస్వరుడిని సంవత్సరానికి ఒక్కసారి నాగ పంచమి నాడు మాత్రమె దర్శించుకునే అవకాశం ఉండటం ఇక్కడ మరో విశేషం.

Maha Kaleshwar Jyotirlinga Templeఈ క్షేత్రం అష్టా దశా క్షేత్రాలలో ఒకటిగా కూడా చెప్పబడింది. ఇంకా ఇక్కడ కోరిన కోర్కెలు తీర్చే వినాయకుని భారీ ఆలయం చూడదగింది. ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభ మేలా నిర్వహిస్తారు.