Gangalo velisina swayambhu Shivalingam gurinchi thelusa?

0
4342

శివుడు లింగరూపంలో వెలసిన గొప్ప శైవక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో గంగతో సహా స్వయంభువుగా శివలింగం ఉంటుంది. ఈ ఆలయం దాదాపుగా 625 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయమని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. gangaloఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ జిల్లా, చోడవరం గ్రామంలో అతి పురాతనమైన శ్రీ గౌరీశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి గొప్ప మహిమ గలవాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సమీపంలోనే మరో స్వయంభూ శివాలయం అయినా సోమలింగేశ్వరాలయం ఉంది. ఇక్కడి కొండపై పచ్చనిచెట్లమధ్య వెలసిన శివలింగం ఉన్నచోటనే తనంతట తాను తిరుగుతుండేదట. అందుకే ఈ ప్రదేశాన్ని లింగాల తిరుగుడు అని పిలుస్తారు. ఇప్పుడు మాత్రం శివలింగం తిరగడం లేదు. gangaloఈ ఆలయ స్థలపురాణానికి వస్తే, చోళరాజు గౌరీశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రోజులలో పరమ శివభక్తుడైన అతడికి ఒకనాడు శివుడు కలలో కనిపించి, నీ కోటకు తూర్పున గంగాదేవితో సహా వెలసి ఉన్నాను అని చెప్పాడట. మర్నాడు ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వి చూడగా, చుట్టూ గంగతో 4 అడుగుల ఎత్త్తెన శివలింగం కనిపించిందట. అదే రోజు ఓ రైతు తన పొలం దున్నుతుండగా నంది, ద్వారపాలకుల విగ్రహాలు బయటపడ్డాయట. రాజుకి రైతు ఈ విషయాన్ని చెప్పగానే రాజు వెంటనే ఆలయ నిర్మాణానికి పనులు ఆరంభించాడు. gangaloగంగతో కలిసి ఉండటం వలన ఆ దేవాలయానికి గంగా గౌరీశ్వర ఆలయం అని పిలుస్తారు. ఆ తరవాతి నుంచీ ఈ ప్రాంతం పాడిపంటలతో వర్ధిల్లింది. అయితే కొన్నాళ్ల తరవాత ఈ ప్రాంతంపై తురుష్కులు దండయాత్ర చేశారు. రాజు వాళ్లతో పోరాడి గెలిచాడు. కానీ, తురుష్కులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. దాంతో శివలింగం ధ్వంసమైపోయింది. ఆలయంతోపాటూ శివలింగాన్ని కూడా పునరుద్ధరించాలనుకున్నాడు రాజు. అప్పుడు ఈశ్వరుడు కలలో కనిపించి లింగం ఇప్పుడున్న స్థితిలోనే పూజాదికాలు నిర్వహించు అని ఆదేశించాడట. దాంతో, నాటినుంచి నేటి వరకూ శిథిల లింగానికే పూజలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ఆలయాన్ని ఎన్నిసార్లు పునరుద్ధరించినా… శివాజ్ఞ ప్రకారం లింగాన్ని మాత్రం పునఃప్రతిష్ఠ చెయ్యలేదు.gangaloఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, మండు వేసవిలో సైతం ఈ ఆలయ కోనేటిలో నిండుగా నీరుంటుంది. అప్పట్లో ప్రజలు ఈ కోనేటిని తాగునీటి కోసం ఉపయోగించేవారు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమినాడు అన్నదానం చేస్తారు.gangaloఇలా పరమశివుడు ఎక్కడ లేని విధంగా గంగలో లో స్వయంభువుగా వెలసిన ఈ ఆలయానికి ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి మహిమ గల ఆ స్వయంభు శివలింగాన్ని దర్శించుకుంటారు.gangalo