Garuda Sthupam Akarshanaga unde Dantheshwari Devalayam

0
3425

సతీదేవి యొక్క 51 శక్తి పీఠాలలో ఇది ఒకటిగా చెబుతారు. అమ్మవారు దంతేశ్వరి గా పూజలందుకొంటున్న ఈ పురాతన ఆలయంలో గరుడ స్థూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది. మరి అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. garuda sthupam
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం దంతేశ్వరి దేవాలయం. ఈ ఆలయం చాలా పురాతమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని దంతేశ్వరి దేవిగా పిలుస్తారు. ఈ అమ్మవారు 51 శక్తి పీఠాలలో ఒకరుగా పేర్కొనబడింది. garuda sthupamఈ ఆలయం చాణుక్యులచే 14 వ శతాబ్దంలో శాంకిని, డాంకీని పవిత్ర నదుల సంగమంలో నిర్మించబడింది. ఇలా ఇక్కడ దంతేశ్వరి దేవిగా పూజలనందుకొంటున్న ఈ అమ్మవారి పేరుమీదుగానే ఈ గ్రామముకు దంతెవాడ అనే పేరు ఏర్పడినది. ఈ దంతేశ్వరిదేవి కాకతీయులకు ఆరాధ్య దేవత. garuda sthupamఇంకా పురాణం ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క పన్ను పడిన ప్రదేశంగా చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఒక నల్లని రాతి శిలాతో చెక్కబడినది. ఈ ఆలయంలో గర్భాలయం, మహా మంటపము, ముఖ్య మండపము, సభా మండపములు కనిపిస్తాయి. గర్భాలయం చిన్న చిన్న రాళ్లతో నిర్మితమైనది. garuda sthupamఈ ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న గరుడ స్థూపం ఆలయమునకు ఆకర్షణగా నిలిచినది. ఇది ఒక ప్రత్యేకతని కలిగి ఉంటుంది. ఇలా కొలువై ఉన్న ఈ అమ్మవారికి దసరా నవరాత్రుల సమయంలో ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చి నవరాత్రులలో అమ్మవారిని దర్శించి తరిస్తారు.garuda sthupam