తిరుమలలో గోవింద నామస్మరణం చేయడం వెనుక పురాణ కథ ఏంటో తెలుసా ?

తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. అయితే ఆ శ్రీవెంకటేశ్వర స్వామిని గోవిందుడిగా పిలువడమే కాకుండా గోవింద గోవిందా అంటూ తిరుమలలో అడుగుపెట్టిన భక్తులు ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద అంటూ భక్తుల గోవింద నామస్మరణం తో ఆలయం ప్రతిధ్వనిస్తుంది. మరి భక్తులు గోవింద నామస్మరణం చేయడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Venkateswara Swamyపురాణానికి వస్తే, గోకులంలో ఉండే ప్రజలంతా కూడా ఇంద్రుడిని పూజించడానికి సిద్ధం అవుతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రునికి ఎలాంటి పూజలు చేయనవసరం లేదంటూ చెప్పడంతో గోకులం లోని ప్రజలంతా కూడా ఇంద్రుడిని పూజించడం మానేశారు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు గోకులం పైన పిడుగులతో కూడిన భయంకర తుఫాన్ వచ్చేలా చేయడంతో గోకులంలో ఉన్న ప్రజలతో పాటు గోవులను కాపాడటం కోసం శ్రీకృష్ణుడు తన చిటికెన వ్రేలుతో గోవర్ధన గిరి ఎత్తి పట్టుకొని రక్షించగా, అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమించమని వేడుకునేందుకు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి దగ్గరికి ఒక కామధేనువు వచ్చి తన బిడ్డలైన గోవుల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడిని పాలతో అభిషేకిస్తుంది.

Sri Krishnaఆ సుందర దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు పరవశించిపోయి ఇలా అంటాడు. నేను దేవతలకి మాత్రమే అధిపతిని కానీ నీవు గోవులకి కూడా అధిపతివి కనుక ఇప్పటినుండి మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు అని ఇంద్రుడు అంటాడు.

Govindaగో అంటే గోవులు లేదా జీవులు అన్న అర్థం ఒక్కటే కాదు, అద్భుతమైన అర్థాలు ఎన్నో గోచరిస్తాయి. ఈవిధంగా అప్పటినుండి ఆ భగవానుడు గోవింద నామంతో పూజలని అందుకుంటున్నాడు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR