Grahapeditha Bhakthulaki Vimukthi Kaliginche SwamyVaaru

తిరుమల తిరుపతి నుండి స్వామివారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వెలిశారని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ఈ స్వామి వారు ఇక్కడ వెలిశారు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. SwamyVaaruఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, హిందూపురం మండలం నందు శ్రీ పేట వేంకటేశ్వరస్వామి వారు ఆలయం ఉంది. ఈ స్వామి భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ వారిచే అభిషేకాలు, పూజలు స్వీకరిస్తున్నారు. హిందూపురంలో ఓ వృద్ధ దంపతుల కోసం తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి వారు హిందూపురానికి తరలి వచ్చి ఇక్కడ శ్రీ పేట వేంకటేశ్వరస్వామి గా వెలిశాడని చెబుతారు. ఈ దేవాలయం సుమారు 650 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. SwamyVaaru
ఇక పురాణానికి వస్తే, పూర్వం హిందూపురం ప్రాంతాన్ని ఒక సామంతరాజు పాలించేవాడు. వారు శ్రీస్వామివారి భక్తులు. రాజుగారి తల్లితండ్రులు వృద్దులు అయినందున తిరుమలకి నడిచివెళ్లి శ్రీ వెంకటరమణుని దర్శించడం ఎలా అని చింతిస్తూ ఆ వృద్ధ దంపతులు ‘స్వామి నిన్ను దర్శించు భాగ్యం కల్పించు అని మనసులో ప్రార్ధించారు. SwamyVaaru
అప్పుడు భక్త జనమందారుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఒకరోజు రాజుగారికి కలలో కనిపించి మీ తల్లితండ్రులకు నా దర్శన భాగ్యం కలగాలన్న నీవు ఈ ప్రాంతంలో నా పేరుతో ఒక ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించాడు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆ రాజు శ్రీ పేట వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠచేసాడు. ఆనాటి నుండి ఈ ప్రాంతవాసులు ఈ స్వామినే శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిగా అర్చించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ దేవాలయం గర్భగుడిలో కంచి కామకోటిపీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారు శ్రీ చక్రాన్ని స్థాపించి మరింత వన్నె తెచ్చారు. ఈవిధంగా ఈ ఆలయం ఎంతో పవిత్రను సంతరించుకుంది. SwamyVaaruఇక అనారోగ్య పీడితులు, సమస్యలతో సతమతమయ్యే గ్రహపీడిత భక్తులు స్వామివారిని దర్శించి విముక్తులవుతారు. హిందూపుర పరిసరవాసులకు ప్రత్యేక్ష కలియుగ దైవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారు దర్శిస్తున్నారు. ఈ ఆలయం నందు మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి బ్రహ్మరథోత్సవాలు ఘనంగా జరుగుతాయి.SwamyVaaru

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR