పచ్చి మిరప కాయలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
1969

పచ్చి మిరపకాయలు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తాయి. అయితే పచ్చి మిరప కాయలు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఆలస్యమెందుకు అవేంటో తెలుసుకుందాం.

బరువు తగ్గుతారు :

Health benefits of green chilliesగ్రీన్ మిరపకాయలు బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైన ఆహారం. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఇది శరీర జీవక్రియను పెంచుతుంది. జీవక్రియ ప్రక్రియలోనే ఆహారాలు శరీరానికి అవసరమైన శక్తిగా మార్చబడతాయి. ఈ సమయంలో కేలరీలు కరిగిపోతాయి మరియు శరీరం బరువు తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం :

Health benefits of green chilliesపచ్చిమిర్చిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది సరైన గుండె పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ.

జలుబు మరియు ఫ్లూ నుండి ఉపశమనం :

Health benefits of green chilliesపచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది పొరల మధ్య రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది మరియు శరీరంలో ఉత్పత్తి చేసే శ్లేష్మాన్ని సడలిస్తుంది. జలుబు మరియు ఫ్లూ వల్ల కలిగే అంటువ్యాధులను తొలగించి, మంచి ఉపశమనం కలిగించడానికి పచ్చిమిర్చి సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది :

Health benefits of green chilliesప్రస్తుత పరిస్థితిలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచవలసి వస్తుంది. ముఖ్యంగా పచ్చిమిరపకాయలు దీనికి ఖచ్చితంగా సహాయపడతాయి. ఆకుపచ్చ మిరపకాయలలో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ మీరు ఒక జార్ లో పచ్చిమిర్చిని ఉంచి, దానిని కప్పి చల్లని ప్రదేశంలో ఉంచితే అందులోని విటమిన్ సి ఉంటుంది. లేకపోతే, ఇది బయటి గాలి, వేడి మరియు సూర్యరశ్మికి గురైతే, దానిలోని విటమిన్ సి తగ్గుతుంది.

డయాబెటిస్‌కు మంచిది :

Health benefits of green chilliesప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువ. అటువంటి డయాబెటిస్ ఉన్నవారు పచ్చిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో సమతుల్య చక్కెర స్థాయిని కొనసాగించవచ్చు. అయితే, యాంటీ డయాబెటిక్ మాత్రలు తీసుకునేటప్పుడు మీరు పచ్చిమిరపకాయలు తింటుంటే, మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

కేప్సైసిన్‌ :

Health benefits of green chilliesపచ్చి మిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ (క్యాస్పేసియన్)అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. మన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి.

జీర్ణశక్తిని పెంచుతుంది :

Health benefits of green chilliesపచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి :

Health benefits of green chilliesమిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.