ఎలాంటి వైరస్‌లను దరిచేరనివ్వని ఫుడ్ ఐటెమ్స్ ఏంటో తెలుసా ?

మనం తీసుకునే ఆహారమే అనేక రోగాలకు ఔషధం. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కాబట్టి రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన శక్తిని అందించడం అవసరం. అది సరిగా.. పనిచేసినప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేల రోగనిరోధిక శక్తి సరిగా పనిచేయకపోతే… శరీరంలోకి బాక్టీరియా, ఫంగస్, వైరస్ లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. వీటన్నింటిని బయటకు పంపిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిచడానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా.. స్ట్రాంగ్ గా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకోసమే రోగనిరోధిక శక్తి ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. మరి ఈ రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలు, అవి కూడా మన వంటగదిలోనే ఉన్నాయి. మరి అవేంటో తెల్సుకుందాం..

Black Peperఅందరి ఇళ్లలో ఉండే నల్ల మిరియాలను కాలి మిర్చ్ అని కూడా అంటారు.. ఈ నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండే నల్ల మిరియాలను రోజూ భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మసాలాలో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

Garlic
వ్యాధినిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ రుచికరమైన ఆహారంలో జింక్, సల్ఫర్, సెలీనియమ్, విటమిన్ ఏ, ఈ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్‌కు కారణమయ్యే బ్యాక్టిరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బని తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరి చేరనివ్వదు.

Gingerఅలాగే అల్లం వళ్ళ అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మన శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తికి అందిస్తుంది. అయితే అల్లాన్ని పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగతటమే కాదు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

Lemonఅనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సీ చాలా అవసరం. అంతేకాదు.. వైరస్, బ్యాక్టీరియా నుంచి కూడా కాపాడటానికి విటమిన్ సీ చాలా అవసరం. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి సిట్రస్ అద్భుతాలు చేయవచ్చు. ఇది తప్పనిసరిగా యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

Termaricపసుపుని మనం వంటకాలకు కాక , దెబ్బలకు రాస్తారు. పసుపు ఏంతో మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలవ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది.

Honeyఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తెనకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉన్నాయి, ఇవి క్రిమినాశక మందులుగా కాలానుగుణ అలెర్జీల నుండి ఉపశమనం కలిగిస్తాయి..

ఈ ఆహారాలే కాకుండా, ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే సహజంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని చిట్కాలు కూడా పాటించాలి.. రోజూ వ్యాయామం చేయడం, తరచుగా షుగర్ లెవెల్స్ చూసుకోవటం, పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవటం.. 8 గంటలు నిద్రపోవటం.. లాంటి నియమాలు పాటిస్తే ఎలాంటి వైరస్ లు మిమ్మల్ని ఎం చేయలేవు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR