Home Health మొబైల్ ఫోన్స్ అధికంగా వాడటం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు!

మొబైల్ ఫోన్స్ అధికంగా వాడటం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు!

0

సెల్‌ఫోన్‌లో కార్టూన్లో, రైమ్సో పెడితేగాని చిన్న పిల్లాడు తిండి తినని రోజులివి. చిన్న పిల్లలు మొదలుకొని ప్రతీ ఒక్కరికీ అవసరం ఉన్నా, లేకపోయినా సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారి పోయింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏమి తింటున్నామో తెలీకుండానే తింటున్నాం. ప్రతీ విషయానికి ఫోన్ ద్వారానే పరిష్కారం వెతుక్కుంటున్నాం.

Health problems caused by use of mobile phonesఎప్పుడూ ఫోన్ మనవద్ద ఉండాల్సిందే. చివరకు పడుకునే సమయంలోనూ ఫోన్‌ను పక్కనే పెట్టుకుంటున్న కాలం ఇది. అయితే ఇలాంటి వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా చాల రకాల సమస్యలు వస్తున్నాయి వాటిని గురించి తెలుసుకుందాం.

స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది:

చాలా మంది మగవారు సెల్ ఫోన్స్ ను ప్యాంట్ ప్యాకెట్ లేదా బెల్ట్ లో వేసుకోవడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతుందని తాజా అద్యయనాలు పేర్కొన్నాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం లేదా స్పెర్మ్ నాణ్యత లోపించడం వంటి ప్రమాధం జరగవచ్చని కొన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

క్యాన్సర్:

మొబైల్ ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతుంటే మీరు క్యాన్సర్‌తో దోస్తీ చేసినట్లే. మొబైల్ ఫోన్లను పదేళ్లుగా వాడే యువతకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువని స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మొబైళ్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మొదడులో కణాలు పెరిగి ప్రాణాంతకమైన ‘గ్లియోమా’ అనే కణితులు ఏర్పడి, మెదడు క్యాన్సర్‌కు దారి తీస్తాయని వారు తెలిపారు. అంతేకాకుండా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవడానికి ఆ రేడియేషన్ ప్రేరేపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో భాగమైన ‘ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ వెల్లడించింది.

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్:

కొన్ని సందర్భాల్లో అధిక టెక్ట్సింగ్ వల్ల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కు దారితీయవచ్చు. చేతికి నొప్పి ఏర్పడి, మణికట్టు నుండి మెదడుకు గల నాళం దెబ్బతింటుంది.

నోమోఫోబియా(Nomophobia):

నోమోఫోబియా అంటే ఆత్రుత. కనెక్టివిటీ పెరిగిన కొద్దీ మానసిక ఆత్రుత అధికమవుతుంది. పోన్లో బ్యాటరీ పూర్తిగా అయిపోయినప్పుడు లేదా నెట్వర్క్ కవరేజ్ లేనప్పుడు మిమ్మల్ని ఆత్రుతకు గురి చేస్తుంది. పిల్లల నుండి ఫోన్ రాకపోతే తల్లుల్లో ఆందోళన మొదలవుతోంది. పిల్లలకి ఏమైందోనన్న భయం వీరి ఆరోగ్యాన్ని చెడగొడుతోంది. మొబైల్ ఉండి ఫోన్ చేయని పిల్లల్ని తల్లిదండ్రులు, భర్తల్ని భార్యలు తప్పుపడుతున్నారు. ఇది వారి మధ్య ఘర్షణను పెంచుతోంది.

మెదడు మీద ప్రభావం:

మొబైల్ ఫోన్లకు ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ – మెదడు కణితి-కు ఉన్న సంబంధం గురించి సంక్లిష్ట సమీక్షను నిర్వహించారు. ఈ పరిశోధనలో, మొబైల్ ఫోన్లను 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉపయోగించినట్లయితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అయిందని కనుగొన్నారు. మెదడులోని రక్త ప్రసరణపై ప్రభావం చూపి బ్రెయిన్‌ ట్యూమర్‌, కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తి మందగించే అవకాశమూ ఉంది. మొబైల్ ఫోన్‌లు కొంత మేర వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రభావం మెదడును తాకే అవకాశ ముంది. కాబట్టి మొబైల్ ఫోన్‌‍ను తక్కువగా ఉపయోగించటం మంచది.

బ్లడ్ ప్రెజర్:

మొబైల్‌ ఫోన్‌ని మితిమీరి వాడితే మీ రక్తపోటు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ వాడకం బిపి పెరుగుదలకు, దానివల్ల గుండె సమస్యలకు కారణం కావచ్చని వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు.

నిద్రలేమి:

మొబైల్ వాడకం పెరిగినకొద్దీ జీవన నాణ్యత తగ్గిపోతుంది. మొబైల్ పక్కన లేకుండా పడుకోలేని పరిస్థితి వస్తోంది. ఏ క్షణంలో మొబైల్ మోగుతోందోనన్న భయం నిద్రలోనూ అనుభవిస్తున్నారు. చిన్న శబ్దానికి కూడా మొబైల్ రింగ్ అనుకుని లేస్తున్నారు. దీని వల్ల నిద్ర తగ్గుతుంది.

చెవిపోటు:

మొబైల్‌ని ఎక్కువగా ఉపయోగించేవారిలో వినికిడి సమస్య వస్తోంది. ధ్వనుల మధ్య ఉన్న తేడాలను పసిగట్టలేకపోతున్నారు. చెవులకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటున్నారు వైద్యులు. చెవిలోని కాక్లియా, కర్ణభేరిలపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు చెవిలోని హెచెర్‌ సెల్స్‌ను దెబ్బతీయడంతో వినికిడిలోపం, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఇది ఆరోగ్యానికి ప్రత్యక్షం కానప్పటికీ, పరోక్షంగా కొన్ని ప్రమాదాలకు దారితీస్తోందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఫోన్లలో మాట్లాడుతూ ద్విచక్రవాహనాలు, కార్లు నడపడం వల్ల, గోర ప్రమాదాలకు గురిఅవుతున్నారు. డ్రైవ్ చేస్తూనే, మొబైల్లో మెసేజ్ లు లేదా మాట్లాడటం వల్ల ఇలా రోడ్ యాక్సిండెంట్లకు కారణం అవుతోందని తెలుస్తుంది. ఇవే కాకుండా సెల్ ఫోన్లో అధికంగా మాట్లాడే వారిలో తలనొప్పి, కళ్ళు తిరగడం, అసౌకర్యం అనుభూతిని కలిగిస్తాయి. తల తిరగడం, కళ్లు బైర్లుకమ్మడం, ఆకలి మందగించడం, ఆందోళన వంటి కొత్త రోగాలు పుట్టుకొస్తాయి.

 

Exit mobile version