రాత్రి పడుకోగానే నిద్ర పట్టాలంటే ఈ చిట్కాలు ఫాలో అవండి!

సమయానికి తిన్నా తినకపోయినా సరిపోయేంత నిద్ర లేకపోతే శరీరం నీరసించిపోతుంది. ఆరోగ్య కారణాలు, ఆర్థిక పరిస్థితులు, వర్క్ టెన్షన్, కుటుంబ పరిస్థితులు అన్నీ వెరసి నేటి జనరేషన్ కి నిద్రని దూరం చేస్తున్నాయి. సతమతం చేసే అనేక ఆలోచనల కారణంగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల సమస్య ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. పడుకున్న వెంటనే నిద్రపోవచ్చు.

home tips on insomnia problemమరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

ప్రతి రోజూ రాత్రి గోరు వెచ్చని పాలను తాగినా నిద్ర బాగా పడుతుంది. ఇది ఎంతో కాలం నుంచి పెద్దలు మనకు చెబుతూ వస్తున్నదే. పాలలో న్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఉంటాయి. ఇవి చక్కని నిద్ర వచ్చేలా చేస్తాయి. మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి.

home tips on insomnia problemరోజూ రాత్రి కొన్ని చెర్రీ పండ్లను తింటే చాలు. నిద్ర చక్కగా పడుతుంది. చెర్రీ పండ్లను తిన్నా, జ్యూస్ తాగినా వాటిలో ఉండే మెలటోనిన్ మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది.

home tips on insomnia problemరాత్రి పూట భోజనంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకున్నా దాంతో నిద్ర బాగా పడుతుంది. వాటిలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేందుకు దోహదపడుతుంది.

home tips on insomnia problemబాదం పప్పులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు, మనస్సుకు రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో చక్కని నిద్ర వస్తుంది.

home tips on insomnia problemఅరటి పండ్లను రాత్రి పూట ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. రక్త సరఫరా మెరువుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది.

home tips on insomnia problemరోజూ రాత్రి గ్రీన్ టీ తాగినా హాయిగా నిద్రపోవచ్చు. గ్రీన్ టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి.

home tips on insomnia problemచేపల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. వారంలో కనీసం 3 సార్లు రాత్రి భోజనంలో చేపలను తింటూ ఉంటే తద్వారా నిద్ర సమస్యలు పోతాయి.

home tips on insomnia problemఅలాగే పగటిపూట ఎక్కువ సమయం నిద్రించకూడదు. అందువల్ల రాత్రివేళ నిద్రపట్టదు. నిద్రరాకుండా ఉంటే మీకు ప్రియమైన సంగీతాన్ని వింటూ నిద్రలోకి జారుకోండి. పదేపదే పడక స్థానాలను మార్చితే కొత్త ప్రదేశం వల్ల నిద్ర రాకపోవచ్చు. అదేవిధంగా టాయిలెట్ అవసరాలను తీర్చుకోకుండా పడకను చేరరాదని గుర్తుంచుకోండి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR