వేసవి తలనొప్పిని నివారించడానికి సులువైన మార్గాలు

కరోనావైరస్ సంక్రమణ సాధారణ లక్షణాలలో తలనొప్పి కూడా ఒకటి. అందులోనూ కరోనా వైరస్ సోకడంతో వచ్చే హెడేక్ అసాధారణ స్థాయిలో ఉంటుందని చాలా మంది బాధితులు చెబుతున్న లక్షణం. వీరిలో కొంతమంది మైగ్రైన్ హెడేక్ తో బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. అయినప్పటికీ, తలనొప్పి సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు, సైనసిటిస్ లేదా అలెర్జీలతో కూడా వస్తుంది కాబట్టి ఈ తలనొప్పి కొవిడ్-19 వల్ల వచ్చిందా లేక సాధారణమైనదా అని గుర్తించడం గందరగోళంగానే ఉంటుంది.

Home tips to reduce headaches during corona periodఅయితే వేసవిలో మీరు ఎదుర్కొనే సాధారణ సమస్యలలో ఒకటి కారణం లేకుండా వచ్చే తలనొప్పి. ఎటువంటి దృఢమైన వైద్య కారణం లేకుండా మీరు తలనొప్పిని అనుభవిస్తే,అందుకు వేసవి వేడే ప్రధాన కారణం. ఇది మీ రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రకమైన కాలానుగుణ తలనొప్పికి మందులు తీసుకోవడం సురక్షితమైనది కాదు. వేసవి తలనొప్పిని నివారించడానికి మీరు చాలా ప్రభావవంతమైన సహజ నివారణలను ఎంచుకోవాలి. ఇది మీ రోజును మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
వేసవి తలనొప్పిని నివారించడానికి చాలా సహజమైన నివారణలు శరీరాన్ని చల్లబరచడం మరియు రీహైడ్రేట్ చేయడంపై దృష్టి పెట్టాలి. వేసవి తలనొప్పి రావడానికి శరీరంలో డీహైడ్రేషనే ప్రధాన కారణం.

Home tips to reduce headaches during corona periodఇంట్లో ఎప్పుడూ ఉండడం ఆచరణాత్మక పరిష్కారం కాదు. కాబట్టి, వేసవిలో తలనొప్పిని నివారించడానికి కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం.

బాగా తలనొప్పి కలిగినప్పుడు.. జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులు తింటే కొంచెం నొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అవి పెయిన్ కిల్లర్స్ మాదిరిగా బాగా పని చేస్తాయి.

Home tips to reduce headaches during corona periodతలనొప్పి ఉన్న సమయంలో స్వచ్ఛమైన గాలిని కొంతసేపు పీల్చుకుని.. ఒంటరిగా కాసేపు వాకింగ్ చేయడం మంచిది

ఆల్కహాల్ అలవాటున్న వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి మద్యం సేవించే అలవాటుకు వేసవిలో కొంచెం దూరంగా ఉండాలి.

Home tips to reduce headaches during corona periodసరిపడా నిద్రలేకపోవడం వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ఫ్రభావం చూపుతుంది. తక్కువగా నిద్రించినా, నిద్ర ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి సరిపడా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

కొబ్బరినీళ్ళు చాలా మంచి ఎంపిక, ఇది మిమ్మల్ని చల్లగా, రిఫ్రెష్ గా మరియు శక్తివంతంగా ఉంచుతుంది. వేసవి తలనొప్పిని నివారించడానికి ఇది ఉత్తమ చిట్కాలలో ఒకటి.

Home tips to reduce headaches during corona periodఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో తాజా నిమ్మరసం కలిపి తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ చిట్కా చాలా తలనొప్పులకు పనిచేస్తుంది.

గోరువెచ్చని ఆవు పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. భోజనంలో నెయ్యి చేర్చడం వల్ల తరచుగా తలనొప్పి రావడం తగ్గుతుంది. టీస్పూన్ వెల్లుల్లి రసం తాగినా త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది.

Home tips to reduce headaches during corona periodగంధం చెక్కను అరగదీసి ఆ పేస్టును నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వెచ్చబెట్టి మర్దనా చేసుకున్నా తలనొప్పి తగ్గుతుంది. యూకలిప్టస్ తైలంతో మర్దన చేసి తలనొప్పి తగ్గించుకోవచ్చు.

నిద్రించడానికి ముందు రోజూ పావుగంట సేపు పాదాలను వేడి నీటి బకెట్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ తలనొప్పి తగ్గిపోతుంది. మూడు వారాల పాటు ఇలా చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

Home tips to reduce headaches during corona periodతరచుగా తలనొప్పి బారిన పడేవారు వెన్న, చాక్లెట్లు, మాంసాహారం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.

డైట్ ప్లాన్‌లో స్వల్ప మార్పులు చేయండి. నీటితో సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చండి. వేసవి కాలంలో మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి పుచ్చకాయ కూడా ఒక అద్భుతమైన ఎంపిక.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR