How Shri Maha Vishnu Was Evolved ??

0
6092

శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం దశావతారాలు ఎత్తాడు. అయితే పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒక అందాల వేశ్యకి వరం కోరుకోమనగా ఆ స్త్రీ నా గర్భమము నందు నీవు జన్మించి నాకు మాతృత్వాన్ని వరంగా ప్రసాదించమని కోరుకుంటుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఎందుకు శ్రీ మహావిష్ణువు ఆమెకు వరాన్ని ప్రసాదిస్తాడు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shri Maha Vishnu

పురాణానికి వెళితే, ఒక స్త్రీ, గండకీ అను పేరుతో శ్రావస్తి అను నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు. అయితే ఆమె రోజుకి ఒక్కరిని మాత్రమే అనుమతించేది. ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు. ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది.

Shri Maha Vishnu

అయితే సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే అతనికి కుష్టు వ్యాధి ఉందని గ్రహించింది. అప్పుడు ఆమె తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమె పైన కోపగించి సంపంగి తైలం పూసి, గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించి, చేనేత వస్త్రాలు చుట్టి చక్కని భోజనం పెట్టింది. అదే కంచంలో తానూ తిన్నది. అయితే జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు.

Shri Maha Vishnu

ఇక అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట వెళ్లి శ్మశాసనంలో చితి పేర్చి తనే నిప్పంటించి తనూ చితిలోకి దూకింది.

Shri Maha Vishnu

అప్పుడు చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది. కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు.

Shri Maha Vishnu

అప్పుడు గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఆ వరం కారణమగానే మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది. నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.

Shri Maha Vishnu

గండకీ నది నేపాల్ లో ఉంది. ఇక్కడ దొరికే నల్లని రాయిని సాలిగ్రామం అంటారు. ఇవి గుండ్రని రాళ్ళలా తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తుంటాడు.

Shri Maha Vishnu

ఇలా గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లి అయినదని పురాణం.