ఆదివారం సాయంత్రం ( 30, August 2020) ఇంట్లో టీవీ చూద్దామని కుర్చుంటే మా నాన్న వచ్చి…తొందరగా ఈ టీవీ పెట్టు అన్నారు. నేను ఆహ్ ఏముంటుంది రోజు చూసే ఈ టీవీ న్యూస్ అనుకున్న కానీ కట్ చేస్తే ఈ టీవీ మానేజ్మెంట్ వాళ్ళు ఈ టీవీ 25 సంవత్సరాల వేడుక ప్రోగ్రాం పెట్టి చూడడం స్టార్ట్ చేసారు. ఆ ప్రోగ్రాం అయిపోయే లోపు ఈ టీవీ, ఈనాడు అధినేత రామోజీ రావు గారు…అయన మన తెలుగు వారికీ ఇచ్చిన కొన్ని బహుమతుల గురించి టీవీ లో చూస్తూ..మా నాన్న గారి మాటల్లో వింటూ ఆశ్చర్యపోయను.
ఒక్కడిగా మొదలై ఈ రోజు ఈ టీవీ, ఈనాడు, మార్గదర్శి అనే వృక్షంల మరి ఎందరికో ఉద్యోగాలు, ఎందరికో వినోదాన్ని, విజ్ఞాన్నాన్ని పంచుతూ విలువలతో వయపరం చేస్తున్న మహా మనిషి రామోజీ రావు గారి గురించి కొన్ని మా నాన్న ద్వారా విని కొన్ని నేను తెలుసుకుని ఇలాంటి వ్యక్తి గురించి మన అందరం తెలుసుకోవాలి అని గ్రహించి…రామోజీ రావు గారి జీవిత ప్రస్థానాన్ని ఈ ఆర్టికల్ రూపం లో మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేశాను…
రామోజీ రావు గారు పుట్టింది, పెరిగింది…చదివింది ?
కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. 1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి 1951 వరకు సిక్త్స్ ఫాం వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని ఓ యాడ్ ఏజన్సీలో ఆర్టిస్ట్‌గా చేరారు.
యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా ఉంటూ వివాహం, వివాహం తరువాత…మార్గదర్శి చీట్స్ తో ప్రస్ధానం మొదలు:
మనం అందరం అనుకున్నట్టు రామోజీ రావు గారు మొదటి అడుగులోనే ఈ టీవీ, ఈనాడు పత్రికలతో లాభాలు ఆర్జించలేదు…వీటికి ముందు అయన ఎన్నో పనులు, ఎన్నో వ్యాపారాలు అందులో లాభ-నష్టాలుచవి చూసారు. 1955 నుండి 1961 వరకు యాడ్ ఏజెన్సీ లో ఆర్టిస్ట్ గా పని చేసిన రామోజీ రావు గారి లైఫ్ ని జీవితాన్ని మలుపు తిప్పిన ఘట్టం అయన వివాహం. 19. 08. 1960లో రామోజీ రావు గారు పెద్దలు నిశ్యాయించిన తాతినేని రమాదేవి గారితో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత ఢిల్లీ యాడ్ ఏజెన్సీ లో జాబ్ వదిలేసి, హైదరాబాద్ వచ్చారు రామోజీ రావు గారు.
హైదరాబాద్ లో మొదట ఏవో చిన్న చిన్న…వ్యాపారాలు చేసిన రామోజీ గారి…1962 అక్టోబరులో మార్గదర్శి చిట్‌ఫండ్ ని స్థాపించారు…అప్పట్లో మధ్య తరగతి వారికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక భరోసా ని ఇచ్చింది…చాల తక్కువ టైం లో మార్గదర్శి ని ప్రజల్లోకి తీస్కొని వెళ్లారు రామోజీ రావు గారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద లాభాలతో….
* 1965లో కిరణ్ యాడ్స్ ప్రారంభం.
* 1967-1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం.
* 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు.
* 1970లో ఇమేజస్ అవుట్‌డోర్ అడ్వర్టయిజింగ్ ఏజన్సీ ప్రారంభం.
* 1972-1973 విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం.
ఒక్కడిగా హైదరాబాద్ లో అడుగు పెట్టిన రామోజీ రావు గారు ఈనాడు పత్రిక స్థాపించడం తో ఇంతింతై వటుడింతయ్యారు…
1973 వరకు మార్గదర్శి, కిరణ్ యాడ్స్, వసుంధర ఫెర్టిలైజర్స్ వంటివి నడిపిన రామోజీ రావు గారు 10.08.1974లో విశాఖ ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభించారు. అప్పటివరకు ‘ఆంధ్రప్రభ’ అనే దినపత్రిక ఒక్కటే ఉన్న తెలుగు వారికీ అది ‘ఈనాడు’ రూపం లో మరో దినపత్రిక వచ్చి చేస్తోంది. అయితే ఇది విశాఖపట్నం వరకే పరిమితమైంది. తరువాత కొన్ని రోజులకు రామోజీ గారు మార్గదర్శి బ్రాండింగ్ ని పెంచుతూ ఆ సంస్థను 12.08.1974లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు.
హైదరాబాద్ లో ఈనాడు….
ఇక అప్పటికే విశాఖపట్నం లో వారానికి 3000 కాపీలు ప్రచురించలేక ‘ఆంధ్ర ప్రభ’ తో పోటీ పడిన ఈనాడు దినపత్రికను, 1975 డిసెంబరు 17న ‘ఈనాడు’ హైదరాబాదు’ ఎడిషన్ పేరుతో ప్రారంభించారు. ‘ఆంధ్ర ప్రభ’ తో పోటీగా ఈనాడు పేపర్ని కొనాలంటే పాఠకులు చదవాలంటే ఎం చేయాలి అని ఆలోచించిన రామోజీ రావు గారు ‘District Edition పేరు తో జిల్లా వ్యాప్తంగా జరిగే వార్తలను ప్రచురించడం మొదలు పెట్టారు. జిల్లా, లోకల్ న్యూస్ తో పాటు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ ప్రచురిస్తూ…ఈనాడుని ఆంధ్ర ప్రదేశ్ లో లార్జెస్ట్ సర్క్యూలేటేడ్ దిన పత్రిక గా మార్చారు.
ఈనాడు తో పాటు…సితార, చతుర, విఫుల మాస పత్రికలను ప్రారంభించారు:
ఇక ఈనాడు దినపత్రిక ని ప్రతి ఇంట్లో చదివే లాగా చేసిన రామోజీ రావు గారు ఆ తరువాత సినీ ప్రేమికుల కోసం, సితార మాస పత్రిక, ఆ తరువాత కథలు, మిగతా వాటిని ప్రచురిస్తూ చతుర, విపుల మాస పత్రికలను మొదలు పెట్టారు.
‘ప్రియా ఫుడ్స్’ పేరు తో ….ప్రియా పచ్చళ్ళ తయారీ వైపు:
ఇక మార్గదర్శి, వసుందర ఫెర్టిలైజర్స్, ఈనాడు, సితార ల వ్యాపారమా తో దూసుకుపోతున్న రామోజీ రావు ‘ప్రియా ఫుడ్స్’ బ్రాండింగ్ తో పచ్చళ్ళ తయారీ లోకి అడుగు పెట్టారు. 09.02.1980లో ‘ప్రియా ఫుడ్స్’ ప్రారంబించిన రామోజీ గారు అచ్చమైన, స్వచ్ఛమైన మన తెలుగింటి పచ్చళ్ళను మన తెలుగు వారికీ ఆ రోజు నుండి ఈరోజుకి అదే క్వాలిటీ తో, అదే రుచి తో అందిస్తున్నారు. మొదట ప్రియా ఫుడ్స్ ద్వారా కేవలం పచ్చళ్లు మాత్రమే తయారు చేసిన ఇప్పుడు మసాలా, రెడీ మేడ్ ఫుడ్స్ ఇడ్లీ, దోస, గులాబ్ జమున్ లాంటి Instant Foods తయారు చేస్తున్నారు.
‘ఉష కిరణ్ మూవీస్’ బ్యానర్ తో సినిమా నిర్మాణం వైపు:
ఇక 02.03.1983లో ‘ఉషాకిరణ్ మూవీస్’ సంస్థ ఏర్పాటు చేయన్ రామోజీ రావు గారు మొదటి ప్రయత్నంగా జంధ్యాల దర్శకత్వంలో 1984 లో ‘శ్రీ వారికీ ప్రేమలేఖ’ చిత్రం నిర్మించారు. ఈ బ్యానర్ పైన ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, డాడీ డాడీ, అశ్విని, నువ్వేకావాలి, చిత్రం, నచ్చావులే లాంటి హిట్ అండ్ అవార్డు విన్నింగ్ చిత్రాలు నిర్మించడమే కాక్ శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, యమున, రిచా, రీమా సేన్, మాధవి లతా లాంటి నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసారు.
ఈ టీవీ & రామోజీ ఫిలిం సిటీలతో పెద్ద వ్యవస్థలకు పునాదులు:
ఇక కాలు పెట్టిన ప్రతి రంగంలో అప్పటికే ఎన్నో విజయాలు అందుకున్న రామోజీ రావు గారు…1995 ఆగస్టు 27 రోజున ‘ఈ టీవీ’ ని స్థాపించారు బుల్లితెర ప్రయాణం మొదలుపెట్టారు. టీవీ అంటే దూరదర్శన్ మాత్రమే అనే రోజుల్లో, ఈ టీవీ ని స్థాపించి వార్తలు, సీరియల్స్, ప్రోగ్రామ్స్ ని మొదలు పెట్టి ఇప్పటికి TRP ల వెంట పడకుండా కేవలం మంచి కంటెంట్ ఇవ్వాలి అనే సిద్ధాంతంతో పని చేస్తున్న సంస్థ ఈటీవీ. ఇప్పటికి చాల మంది న్యూస్ అంటే ఈటీవీ చూస్తారు అంటే అర్ధం చేసుకోవచ్చు…ఇంత కాంపిటీషన్ మధ్యలో కూడా రామోజీ గారు అమలు చేస్తున్న సిద్ధాంతాలే వల్లే ఈటీవీ కి అండ్ ఈటీవీ న్యూస్ కి ఆ బ్రాండింగ్ వచ్చింది.
ఇక పోతే 1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ స్థాపించిన రామోజీ రావు గారు దీని ద్వారా తెలుగు చిత్ర సీమకి ఎప్పటికి వెలకట్టలేని ఒక పెద్ద బాహుమతి ని ఇచ్చారు. 1666 ఎకరాలలో ఉన్న ఈ ఫిలిం సిటీ లో ఇప్పటికి వరకు ఎన్నో వేల తెలుగు, తమిళ, దక్షిణాది భాషలతో పాటు హిందీ సినిమా షూటింగ్లు కూడా జరిగాయి.
ఈటీవీ నుండి ఈటీవీ నెట్వర్క్ వైపు అడుగులు:
27.01.2002లో ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్ల ప్రారంబించిన రామోజీ రావు గారు…2015 వచ్చేసరికి ఈ టీవీ ని ‘ఈ టీవీ నెట్వర్క్’ గా అప్ గ్రేడ్ చేసి ETV life – a health and wellness channel, ETV Abhiruchi, a cookery channel, ETV plus తో పాటు ETV న్యూస్ Andhra , Telangana లాంటివి 12 తెలుగు చానెల్స్ స్టార్ట్ చేసారు. ఇవి కాకుండా ETV Marathi, ETV Gujarati, ETV Kannada, ETV Bangla మరియు ETV డీ చానెల్స్ ని కూడా స్టార్ట్ చేసారు.
20.06.2002లో ‘రమాదేవి పబ్లిక్ స్కూల్’ ప్రారంభం.
14.04.2008లో సమాచార చట్టం కోసం ‘ముందడుగు’
25.12.2014లో ప్రధాని మోదీ ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు.
ఇలా ఒక్కడిగా మొదలైనా రామోజీ రావు జర్నలిజం, టీవీ, విద్య, వ్యాపారం లో తెచ్చిన మార్పుకు, చేసిన కృషికి మెచ్చి భారత ప్రభుత్వం 2016 లో రామోజీ రావు గారిని ‘పద్మ విభూషణ్’ అవార్డుతో సత్కరించింది.